టాలీవుడ్ లో చాలా పాపులర్ అయిన జంటల్లో ఉపాసన రామ్ చరణ్ ఒకరు. ఉపాసాన మంచి వ్యాపారవేత్తగా రామ్ చరణ్ మంచి నటుడిగా ప్రస్తుతం రాణిస్తున్నారు. ఇది బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా బలమైనదే. వీరి కుటుంబాలు కూడా అత్యంత జాగ్రత్తగా వ్యాపార రంగంలో సినీ రంగంలో రాణిస్తూ ఉన్నాయి. ఇక వీరి కలయిక వీరి వివాహం టాలీవుడ్ లో చాలా రోజులు అనేక సందేహాలు అనేక చర్చలకు వేదికగా మారింది. టాలీవుడ్ జనాలు చాలా మంది వీరి జంట గురించి ప్రత్యేకంగా చర్చించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

 

ఇక వీరి కలయిక తర్వాత వివాహం జరగడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అని చెప్తూ ఉంటారు. వీరి వివాహం అంత ఈజీ గా జరగలేదు అనేది కుటుంబ సన్నిహితులు ప్రత్యేకంగా చెప్తూ ఉండే మాట. ముందు చిరంజీవి అసలు అంగీకరించలేదు అని అంటారు. దానికి కారణాలు ఆ కుటుంబానికి రాజకీయ సంబంధాలు ఉండటమే కాకుండా కొన్ని కొన్ని విషయాల్లో ఉపాసన రామ్ చరణ్ ని దాటేసింది అని, రామ్ చరణ్ కెరీర్ మొదట్లో ఉన్నాడు అని కాని ఉపాసనా వ్యాపారవేత్తగా చాలా విజయాలు కెరీర్ లో సాధించింది అని అది రామ్ చరణ్ కి ఇబ్బందిగా ఉంటుంది అని భావించారట. 

 

అందుకే వీరి వివాహాన్ని అంత త్వరగా అంగీకరించలేదు చిరంజీవి అని చెప్తూ ఉంటారు. అయితే చిరంజీవికి ఆ తర్వాత రామ్ చరణ్ అన్నీ జాగ్రత్తగా చెప్పాడు అని అప్పుడు చిరంజీవి ఓకే చేసారని అంటారు. ఏది ఎలా ఉన్నా వీరి వివాహం ఇప్పటికి ఒక సంచలనమే అని అంటున్నారు టాలీవుడ్ జనం. రామ్ చరణ్ కెరీర్ లో ఇప్పుడు పీక్స్ లో ఉన్నాడు అనేది వాస్తవం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: