విజయ్ దేవరకొండ.. సినిమాల్లోనే కాదు.. బయట కూడా అగ్రెసివ్ గా కనిపిస్తాడు. ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నింటిలో మ్యాగ్జిమమ్ అలాగే కనిపించాడు. అందుకే  కెరీర్ స్టార్టింగ్ నుంచి విజయ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. అసలు విజయ్ ఇంత పాపులర్ అవ్వడానికి సోషల్ మీడియా కూడ వన్ ఆఫ్ ద రీజన్. విజయ్ ఫస్ట్ నుంచీ కాంట్రవర్సీలతోనే ట్రావెల్ అవుతున్నాడు. ప్రతిసినిమాకీ ఏదోకరకంగా సెన్సేషన్ అవుతున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత చేసిన గీత గోవిందం సినిమాతో 100 కోట్ల హీరో అయిపోయాడు. ఈ సినిమా తరవాత  విజయ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చి స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. మహేష్ , రాజమౌళి లాంటి స్టార్లు రౌడీ హీరో విజయ్ గురించి పబ్లిక్ గా ప్రెయిజ్ చేసేంత ఎదిగాడు.

 

గీతగోవిందం తర్వత వచ్చిన నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ ఏవీ పెద్ద హిట్ అవ్వలేదు.  ఎందుకంటే .. అందరికన్నా డిఫరెంట్ గా సినిమాలు చెయ్యాలనుకుని ప్రయోగాలు చేస్తున్న విజయ్ దేవరకొండ.. సబ్జెక్ట్ సెలక్షన్లో ఎక్కడో మిస్ ఫైర్ అవుతున్నాడు. తన క్రేజ్ కి ఏ సినిమా చేసినా జనాలు చూస్తారు అనే గుడ్డి నమ్మకం విజయ్ ను ప్రేక్షకులకు దూరం చేస్తోంది. రీసెంట్ గా నలుగురు హీరోయిన్లతో క్రాంతిమాదవ్ డైరెక్షన్లో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా  కూడా అంతే. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక అస్సలు అడ్రస్ లేకుండా పోయింది. ఏ క్రేజ్.. మ్యాజిక్ తో.. ఆడియన్స్ ని విజయ్ ఎట్రాక్ట్ చేశాడో.. ఇప్పుడు అదే మ్యాజిక్ ఆడియన్స్ కి మొనాటనీ అనిపిస్తోంది. అందుకే లవ్ స్టోరీలు చెయ్యనని చెప్పాడు విజయ్.

 

ఆడియన్స్ కి ఎప్పుడూ ఒకేలా ప్రొజెక్ట్ అవుతున్నాడు విజయ్. అందుకే బోర్ కొడుతున్నాడు ఈ మద్య.  కానీ విజయ్ కి ప్రస్తుతం హిట్ అత్యవసరం .అందుకే  అసలు ఫస్ట్ పూరీ తో సినిమా వద్దనుకున్న విజయ్ ఇప్పుడు ఆశలన్నీ పూరీ మీదే పెట్టుకున్నాడు. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సనిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్యతో కలిసి కనిపించబోతున్నాడు. హీరోగా కెరీర్ కంటిన్యూ చేస్తూనే.. మరో వైపు ప్రొడ్యూసర్ గా మారాడు . రౌడీ వేర్ ఫ్యాషన్ క్లోతింగ్, షూస్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఫౌండేషన్ స్టార్ట్ చేసి మిడిల్ క్లాస్ పీపుల్  తో పాటు చాల మంది హెల్ప్ చేస్తున్నాడు . 


ఇలా  పర్సనల్ గా,ప్రొఫెషనల్ గా తను డిఫరెంట్ అని ప్రూవ్  చేసుకుంటున్న విజయ్  మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది. వాటికి  పర్సనల్ గా పెద్దగా రెస్పాండ్  అవ్వకుండా ట్రోల్స్ ని బాగా చూస్తానని.. ఇన్ ఫాక్ట్ ఆ మీమ్స్ అంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు. ఈ మద్య ఆ ట్రోలింగ్ , ప్రొఫెషనల్ గా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని  సోషల్ మీడియాలో కొన్ని సైట్ల మీద బాగా ఫైర్ అయ్యాడు విజయ్. బట్.. ఇష్యూ ఏదైనా, సినిమా హిట్ అయినా కాకపోయినా..  ఈ 5 ఏళ్ల కెరీర్ లో విజయ్ కు మాత్రం రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: