జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి... అటు రాజకీయాల్లో అయినా ఇటు సినీ రంగంలో అయినా సరే వీరి వివాహ౦ ఒక సంచలనం. ఎన్టీఆర్ కంటే చిన్నది అయిన లక్ష్మీ ప్రణతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఆమె వయసు విషయంలో కొన్ని రోజులు పెళ్లిని వాయిదా వేసి అప్పుడు చేసారు. అసలు దానికి కారణం ఏంటీ... ఆమెనే ప్రేమ వ్యవహారం లేకపోయినా సరే ఎందుకు చేసుకోవాలని అనుకున్నారు అనేది ఎవరికి తెలియదు గాని వీరి వివాహం వెనుక మాత్రం రాజకీయ కోణాలు ఉన్నాయి అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

ఒక అగ్ర రాజకీయ వేత్త వీరిని కలపడానికి గానూ తీవ్రంగా ప్రయత్నాలు చేసారని మీడియా సంస్థ అధినేత ద్వారా ఈ వివాహం ఆయనే స్వయంగా చేసారు అని అంటారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకుని ఈ వివాహాన్ని ఎన్టీఆర్ కి చేసారు అనేది కొందరు మాట్లాడే మాట. ఇక వీరిద్దరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారట. కెరీర్ లో ఎన్టీఆర్ చాలా పీక్స్ లో ఉన్నాడు. ఇద్దరు పిల్లలు ఆభయ్ రామ్ భార్గవ్ రామ్ పుట్టారు. అయితే హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అది ఒక్కటే వీరిని బాధ పెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. 

 

ఎన్టీఆర్ తల్లికి లక్ష్మీ అత్యంత సన్నిహితంగా ఉంటుంది. ఆమె కష్ట సుఖాలను ఆమె బాధలను అన్నీ పంచుకుంటూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ కి కూడా కెరీర్ లో ఆమె అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటారని అంటున్నారు. ఆమె తో ఎన్టీఆర్ అన్ని విషయాలు చర్చించడమే కాకుండా పిల్లల బాధ్యత విషయంలో ఆమెకు అనేక సూచనలు సలహాలు చేస్తూ ఉంటాడు అని అంటారు. తల్లికి అన్ని విధాలుగా లక్ష్మి ప్రణతి అండగా ఉండటం ఎన్టీఆర్ కి బాగా నచ్చిన అంశం అని కూడా అంటారు టాలీవుడ్ జనం.

మరింత సమాచారం తెలుసుకోండి: