కరోనా ఉధృతి రోజు రోజుకీ పెరుగుతుండడంతో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునేలా లేవు. సామాజిక దూరం పాటించాలన్న నేపథ్యంలో థియేటర్లు మరికొన్ని రోజులు మూతబడే ఉంటాయి. మూడవ విడత లాక్డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ థియేటర్స్, మాల్స్ కి మాత్రం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో థియేటర్ ఓనర్స్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.

 

 

థియేటర్లు మూతబడిపోవడమ్తో నిర్మాతలు ఓటీటీల వంక చూస్తున్నారు. ఆన్ లైన్లో డైరెక్టుగా సినిమా రిలీజ్ చేసేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబో సినిమా ఆన్ లైన్ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ మేరకు నిర్మాతలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు కూడ. జూన్ ౧౨వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవనుంది.

 

 

దీంతో దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ ఓనర్ నిర్మాతలకి వార్నింగ్ ఇచ్చాడు. డైరెక్టుగా సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే, థియేటర్లు తెరుచుకున్నాక మా పవర్ ఏంటో చూపిస్తామని వార్నింగ్ తో కూడిన లెటర్ రాసి సంచలనం సృష్టించాడు. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్సులకి అంత స్వార్థం పనికి రాదని, థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో ఒక క్లారిటీ లేనందునే ఇలా చేయాల్సి వచ్చిందని బాలీవుడ్ సెలెబ్రిటీలు అంటున్నారు.

 

 

అంతే కాదు, ఒక సినిమా నిర్మించడానికి నిర్మాతలు తమ దగ్గర్ ఉన్న మొత్తం డబ్బుని పెడతాడని, అదీ చాలకపోతే ఎక్కువ మొత్తంలో అప్పుగా తీసుకువస్తాడని, ఇలాంటి టైమ్ లో ఆ అప్పులకి వడ్డీలు ఏ రేంజ్ లో పెరుగుతాయో ఒక్క నిర్మాతకే తెలుస్తుందని, అందువల్ల సినిమాని ఎక్కడ రిలీజ్ చేయాలనేది నిర్మాత ఇష్టం అని మరో సెలెబ్రిటీ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: