ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. తనకున్న చాక్లెట్ బాయ్ ఇమేజ్ ని పోగొట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తరహాలోనే ఇది కూడా మాస్ మసాలా చిత్రం. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ లని చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమైంది. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా కనిపిస్తుంది.

 

కరోనా కారణంగా సినిమా రిలీజ్ లన్నీ ఆగిపోవడంతో రెడ్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని మంచి ఆఫర్ వచ్చిందట. కానీ తన సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలని రామ్ కోరుకున్నాడు. అందుకు తగ్గట్టుగా ఓటీటీలో రిలీజ్ కాదనేందుకు నిదర్శనంగా సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేశాడు. మొన్నటికి మొన్న ఇటలీలో షూటింగ్ జరుపుకున్న మేకింగ్ వీడియోని రిలీజ్ చేశాడు. అలాగే నేడు మరొ కొత్త అప్డేట్ తో ముందుకు వస్తున్నాడు. 

 

నేడు రామ్ పొతినేని పుట్టినరోజు. కరోనా కారణంగా భౌతిక దూరం పాటించాలన్న నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలని జరుపుకోవద్దని అభిమానులకి తన విన్నపాన్ని తెలియజేసిన రామ్, పుట్టినరోజు కానుకగా అభిమానులకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు. రెడ్ సినిమా నుండి డించక్ అనే పాట వీడియో గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నాడు. ఈ రోజు ఉదయం ౮ గంటలకి ఈ వీడియో గ్లింప్స్ రిలీజ్ కానుంది. మణిశర్మ మ్యూజిక్ తో మంచి మాస్ పాట అని తెలుస్తుంది.

 


అయితే రెడ్ మూవీలో హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో రామ్ తో స్టెప్పులేసిందని తెలిసిందే. మరి డించక్ అనే సాంగ్ హెబ్బా చేసిన స్పెషల్ సాంగే అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. తమిళ చిత్రమైన తడం కి రీమేక్ గా రెడ్ తెరకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: