పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ఒక టాప్ దర్శకుడితో ఉంటే బాగుంటుంది అని పవన్ అభిమానులుఆశించారు. అయితే ఎవరు ఊహించని విధంగా పవన్ ‘పింక్’ రీమేక్ కు ఓకే చెప్పడమే కాకుండా ఏమాత్రం అనుభవంలేని దర్శకుడు  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ గా నటిస్తూ ఉండటం పవన్ వీరాభిమానులకు కూడ పూర్తి గా నచ్చడంలేదు.  


వాస్తవానికి పవన్ ఫిలిం రీ ఎంట్రీ నిర్ణయం తీసుకున్న వెంటనే చాలావేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తూ అందరికి షాక్ ఇచ్చాడు. దీనితో మారిపోయిన పవన్ వ్యవహార శైలిని చూసి కరోనా కు కూడ షాక్ అయి పవన్ సినిమాల స్పీడ్ కు అడ్డుకట్ట వేసింది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం లాక్ డౌన్ పిరియడ్ లో ఖాళీగా ఉన్న పవన్ కళ్యాణ్ వద్దకు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఒక షాకింగ్ సూచనను చేసినట్లు తెలుస్తోంది. 


పవన్ తివిక్రమ్ ల సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ నిర్మాత ఒకవేళ ‘ఆర్ ఆర్ ఆర్’ ఆలస్యం అవ్వడం వలన జూనియర్ త్రివిక్రమ్మూవీ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే పరిస్థితులలో త్రివిక్రమ్ వెంకటేష్ మూవీ వైపు చూసే బదులు పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ పూర్తి అయిన వెంటనే వేగంగా సినిమా చేస్తే బాగుంటుంది అని ఆ ప్రముఖ నిర్మాత ఆలోచన అని అంటున్నారు. అంతేకాదు ‘వకీల్ సాబ్’ పూర్తి అయిన తరువాత ప్రస్తుతం పవన్ నటిస్తున్న క్రిష్ సినిమాతో పాటు త్రివిక్రమ్ తో సినిమాను కూడ లైన్ లో పెట్టి ఒకేసారి పూర్తి చేస్తే బాగుంటుంది అన్నఆలోచన ఆ నిర్మాతది అని అంటున్నారు.


ఈసూచన పవన్ కు కూడ నచ్చడంతో ఆనిర్మాత ఈమధ్య త్రివిక్రమ్ ను టచ్ లోకి తీసుకుని పవన్ కు సరిపడే కథలు ఉన్నాయా అని ఎంక్వైరీలు చేస్తున్నట్లు టాక్. ఇప్పుడు ఇలా ఈగాసిప్పులు ఇలా బయటకు రావడంతో ఇండస్ట్రీ వర్గాలు మాత్రం వేరేవిధంగా స్పందిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ కు ఉన్న కమిట్ మెంట్స్ రీత్యా ఎవరైనా నిర్మాతలు అడిగితే పవన్ సినిమాకు కథ ఇవ్వగలడు కానీ ఇప్పటికే కమిట్ అయిన జూనియర్ మూవీ అదేవిధంగా చర్చలు నడుస్తున్న వెంకటేష్ తో మూవీలను పక్కకు పెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పవన్ తో ఎంత స్నేహం ఉన్నా ఎంటర్ అవ్వడం అసాధ్యం అంటూ ఈవార్తలను కొట్టిపారేస్తున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: