నాగ చైతన్య... సమంతా... టాలీవుడ్ హిట్ పెయిర్ లో వీరి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు. వీరి వివాహం నుంచి ప్రతీ ఒక్కటి కూడా సంచలనమే. ముందు తొలి సినిమా తో ఆమె తో ప్రేమలో పడి ఆ తర్వాత ఆమెకు దూరం జరిగి ఆమె సిద్దార్థ తో ప్రేమలో పడి ఆమె అతనికి దూరమై మళ్ళీ చైతన్య కు దగ్గర జరగడం ఇలాంటివి చాలా మనకు కనపడుతూ ఉంటాయి. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న జంటల్లో వీరి జంట ముందు ఉంటుంది. వీరు ఇద్దరు కలిసి స్క్రీన్ మీద కనపడితే సినిమా కచ్చితంగా హిట్ అనే భావన కూడా ఉంటుంది ప్రేక్షకులకు అనేది వాస్తవం. 

 

వీరు ఇద్దరూ కలిసి ఏ సినిమా చేసినా సరే అది టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. వీరి కెరీర్ లో చాల మంచి సినిమాలను చేసారు. ప్రతీ సినిమా విషయంలో కూడా ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి చేసుకున్నారు. ఇక వీరి వివాహం విషయంలో ముందు నుంచి కూడా అక్కినేని నాగార్జున చాలా జాగ్రత్తగా వ్యవహరించారు అని చెప్తూ ఉంటారు. సమంతా ప్రేమ వ్యవహారాన్ని నాగ చైతన్య ఇంట్లో చెప్పిన వెంటనే నాగార్జున ఓకే చేసారు అని అంటూ ఉంటారు. తల్లి లక్ష్మీ కూడా ముందే ఓకే చేసారని సమంతా తో మాట్లాడి ఓకే చేసారు అని అంటున్నారు. 

 

అగ్ర హీరోలకు కూడా లేని పాపులారిటి ఆమె సొంతం. కాని చైతు కి ఆ స్థాయిలో పాపులారిటి లేదు. టాలీవుడ్ లో వీరి జంట విషయంలో కొందరు ఎన్ని వార్తలు రాసినా సరే వీరు మాత్రం చాలా దగ్గరగా ఉన్నారు. వీరి కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: