భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ పెళ్లి అయ్యి 3 సంవత్సరాలు కావస్తున్నా వాళ్లిద్దరూ ఇప్పటికీ నూతన దంపతుల లాగానే తమ వైవాహిక బంధాన్ని కొనసాగిస్తున్నారు. అనుష్క శర్మకి అందంతో పాటు మంచి మనస్తత్వం ఉంటుంది. అందుకే విరాట్ కోహ్లీ ఆమెను కలవగానే వెంటనే మనసు పారేసుకున్నాడు. 2013వ సంవత్సరంలో షాంపూ యాడ్ చిత్రీకరణలో కలుసుకున్న విరాట్ కోహ్లీ అనుష్క శర్మల మధ్య స్నేహబంధం ఏర్పడింది. 2014వ సంవత్సరంలో ఐపీఎల్ మ్యాచ్ పూణే నగరంలో జరుగుతున్నప్పుడు అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ఫర్ఫార్మెన్స్ చూసేందుకు వచ్చింది.


హైదరాబాదులో శ్రీలంక ఇండియాల మధ్య నెలకొన్న క్రికెట్ మ్యాచ్ ని వీక్షించేందుకు అనుష్క శర్మ రాగా... ఆఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ అనుష్క శర్మ కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అదే సంవత్సరంలో అనుష్క శర్మ నటిస్తున్న బాంబే వెల్వెట్ సెట్స్ కి వెళ్లి అనుష్కని కలిసేవాడు. అనుష్క పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపేందుకు విరాట్ ఉదయ్పూర్ కు కూడా వెళ్లాడు. 2016 సంవత్సరంలో విరాట్ కోహ్లీ అన్ని క్రికెట్ మ్యాచ్లలో చాలా ఘోరంగా ఆడగా... దానికి కారణం అనుష్క శర్మ అని దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.


అనుష్క శర్మ కారణంగానే క్రికెట్ పై విరాట్ కోహ్లీ దృష్టి కోల్పోయాడని ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజనులు. దాంతో బాగా మనస్తాపానికి గురైన అనుష్క శర్మ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ఖాతాలను అన్-ఫాలో(unfollow) అయ్యి ఎవరికీ కనిపించకుండా తన జీవితం గడప సాగింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... ఎవరైతే నా బ్యాడ్ పర్ఫామెన్స్ కి కారణం అనుష్క శర్మ అని ట్రోల్ చేసారో వారందరికీ సిగ్గు లేదు. నా పర్ఫామెన్స్ పై ఆమె ప్రభావం అణువంతైనా లేదు. ఇంకా చెప్పాలంటే ఆమె నాలో ఎంతో పాజిటివ్ నింపి మ్యాచ్ లో బాగా ఆడాలని నా వెన్ను తట్టుతుంది అని చెప్పుకొచ్చాడు.


ఈ వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతగానో ప్రశంసించారు. అనుష్క శర్మ కూడా విరాట్ కోహ్లీ మాటలకు మళ్లీ ఫిదా అయిపోయి తనకు బాగా దగ్గరైంది. తదనంతరం వాళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఎన్నోసార్లు మీడియాకి చిక్కారు. డిసెంబర్ నెల, 2016 సంవత్సరంలో గోవాలో జరిగిన యువరాజ్ సింగ్ వెడ్డింగ్ లో విరాట్, అనుష్క విచ్చేసి బాగా సందడి చేసారు. అదే సంవత్సరం అదే నెల 30 తేదీన మా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అని విరాట్ తెలిపాడు. 2017 సంవత్సరంలో డెహ్రాడూన్ లో క్రిస్టమస్ వేడుకలు ఇద్దరూ కలసి జరుపుకున్నారు. సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ ప్రమోషన్స్ లో విరాట్ కోహ్లీ హాజరయ్యి... అనుష్క శర్మ లో నాకు బాగా నచ్చింది ఆమె నిజాయితి. తన మనసులో ఏమి అనుకుంటుందో అది బయటకు చెప్పేస్తుంది. అది నాకు బాగా నచ్చింది' అని చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 11, 2017 సంవత్సరంలో ఇటలీలోని బొర్గో అనే ఎనిమిది వందల సంవత్సరాల వయసున్న గ్రామంలో స్వర్గాన్ని తలపించే ప్రకృతి నడుమ 42 మంది బంధుమిత్రుల సమక్షంలో విరాట్ కోహ్లీ అనుష్క శర్మకి పెళ్లి తాడు కట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: