పెళ్లంటే జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం మాత్రమే కాదు, జీవితాన్ని ఎన్నుకోవడం. ఇక మ‌న భార‌త‌దేశంలో పెళ్ళి అనేది చాలా గొప్ప సంస్కృతి. ఇక్క‌డి క‌ట్టుబాటులు, సంస్కృతి సంప్ర‌దాయాల‌ను చాలా మంది ఇత‌ర దేశాల వాళ్ళు కూడా గౌర‌విస్తారు. ఇక భార‌తీయుల‌కు సంబంధించి వివాహం ఒక అద్భుత ప్రక్రియ. ఇక సినీ తరాల మధ్య ప్రేమ వ్యవహారాలు ఎపుడూ జరిగేదే. కానీ కొన్ని జంటలు మాత్రమె ఎవరూ ఊహించని విధంగా ఒక్కటవుతుంటారు. తమ వయసు కంటే పదేళ్ళు ఎక్కువ లేక పదేళ్ళు తక్కువ వయసున్నవారిని ఇలా న‌చ్చిన‌వాళ్ళ‌ను చేసుకుంటుంటారు. టాలీవుడ్‌లో ఒక టైమ్‌లో ఒక ఊపు ఊపిన హీరోయిన్‌ జెనీలియా తన మొదటి సినిమా నటించిన నటుడు రితేష్ దేశముక్ ను లవ్ చేసి పెళ్లిచేసుకుంది వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తొమ్మిదేళ్ళు ఉన్న‌ప్ప‌టికీ వీరిద్ద‌రూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బాయ్స్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ బాలీవుడ్‌లో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకుంది.

 

ముంబ‌యికి చెందిన ఈ స్లిమ్ బ్యూటీ తెలుగులో చాలా హిట్ చిత్రాల్లో న‌టించింది. బొమ్మ‌రిల్లు చిత్రంలో జెనీలియా న‌టించిన హాసిన పాత్ర త‌న కెరియ‌ర్‌లోనే ఒక మైలురాయి లాంటిద‌ని చెప్ప‌వ‌చ్చు. తెలుగు మాత్ర‌మే కాదు హిందీ, క‌న్న‌డ చిత్రాల్లో కూడా న‌టించింది. డిగ్రీ చ‌దువుతుండ‌గానే మొద‌టి చిత్రంలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. హిందీలో తుజే మేరీ క‌స‌మ్ చిత్రంతోనే రితేష్ కూడా వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డి ప్రేమ‌గా మారింది.

 

వీరిద్ద‌రూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరి ప్రేమ‌కి ఇరువైపుల కుటుంబాలు అంగీక‌రించ‌డం విశేషం. జెనీలియాకి రియాన్ రాయ‌ల్ అని ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. పెళ్ళి త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కు దూర‌మ‌యింది జెనీలియా. భ‌ర్త రితేష్ ఎంత ప్రోత్స‌హించినా ఎందుకో పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూప‌లేదు. ఇక పిల్ల‌లు కొంచం పెద్ద‌య్యాక ఇటీవ‌లె మ‌ళ్ళీ సెట్స్ మీద అడుగుపెట్టింది. అది కూడా గెస్ట్ పాత్ర‌లు త‌ప్పించి ఫుల్ లెంగ్త్ పాత్ర‌లు చేయ‌లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: