టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు.. కొంతమంది తమతో పాటు నటించిన నటీమణుల నే పెళ్లి చేసుకుంటే.... కొంతమంది వేరే రంగానికి చెందిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న జంటలు టాలీవుడ్ లో ప్రేక్షకులకు ఎప్పుడూ ఫేవరెట్  గా ఉంటాయి. ఇక అటు ప్రేమ పెళ్లిళ్లు కాకుండా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లు కూడా చాలా మంది ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రేక్షకులకు ఫేవరేట్ జంటగా దూసుకుపోతున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ జంట ఏది అంటే... రాజీవ్ కనకాల సుమ అనే చెప్పాలి. 

 

 వీరిద్దరూ పెళ్లి చేసుకొని దాదాపు దశాబ్దాలు గడిచిపోతుంది. అయినప్పటికీ వీరిద్దరి మధ్య అన్యోన్యత మాత్రం ఎంతో చక్కగా ఉంటుంది. వీరిద్దరూ భార్యాభర్తలుగా  కాకుండా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటారు. ఓ వైపు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కనకాల సినిమాలతో దూసుకుపోతున్నారు. మరోవైపు ఒకప్పుడు హీరోయిన్గా చేసినప్పటికీ పెళ్లి బంధానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ముందుచూపుతో ఆలోచించిన సుమ సినిమా జీవితానికి స్వస్తి పలికి బుల్లితెరపై యాంకర్గా అవతారం ఎత్తింది. 

 

 

 ఇక ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్గా ఎవరికీ సాధ్యం కానీ  గుర్తింపు సంపాదించింది యాంకర్ సుమ. బుల్లితెరపై యాంకర్ సుమ అదరగొడుతుంటే  వెండి తెరపై రాజీవ్ కనకాల ఇరగదీస్తాడు. ఇలా ఎవరికి వారు దూసుకుపోతున్నారు. అంతేకాదు భార్య భర్తలన్న  తర్వాత ఎంతో అన్యోన్యత తో పాటు ఒకరికి ఒకరు సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరిద్దరిని చూస్తే అది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. భర్త  కెరియర్కి భార్య... భార్య కెరియర్ కి భర్త ఎప్పుడూ సహకరిస్తూ సపోర్ట్ చేసుకుంటూ  వుంటారు ఈ ఇద్దరు.

మరింత సమాచారం తెలుసుకోండి: