2017 సంవత్సరంలో మెట్ గల(Met Gala) కార్యక్రమంలో క్వాంటికో స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనస్ మొట్టమొదటిగా కలుసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత 2018 మే నెలలో బ్యూటీ అండ్ ది బీస్ట్ హాలీవుడ్ చిత్రాన్ని నిక్ జోనస్, ప్రియాంక చోప్రా కలిసి లాస్ ఏంజిల్స్ లోని ఒక థియేటర్ లో చూశారు. ఆ తర్వాత మిత్రులతో కలిసి ఎన్నో ప్రాంతాల్లో తిరుగుతూ మీడియా కళ్ళలో పడగా... వారిద్దరి మధ్య రిలేషన్ షిప్ కొనసాగుతుందని పుకార్లు షికార్లు అయ్యాయి. 2018 జూన్ నెలలో ఒకరికొకరు తమ ఇంస్టాగ్రామ్ పోస్టులపై కామెంట్స్ చేయడం ప్రారంభించారు.


అదే నెలలో నిక్ జోనస్ కుటుంబ శుభకార్యాలలో ప్రియాంక చోప్రా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. వాళ్ల అందరితో కలిసి భోజనం కూడా చేసింది. తదనంతరం నిక్ జోనస్ ప్రియాంక చోప్రా తో కలిసి ఇండియాకు వచ్చి ఆకాశ్ అంబానీ ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ లో పాల్గొన్న. జులై నెలలో ప్రియాంక చోప్రా నిక్ జోనస్ గురించి మొట్టమొదటిగా మాట్లాడింది. అతడు తనతో మాట్లాడుతుంటే తనకి ఒక గొప్ప అనుభూతి లభిస్తుందని... అతడికి కూడా నాతో మాట్లాడుతుంటే బాగా సంతోషం వేస్తుందని... ప్రస్తుతానికి ఒకరినొకరు గురించి బాగా తెలుసుకుంటున్నాం అని చెప్పింది.


అదే నెలలో ప్రియాంక చోప్రా బర్త్ డే వేడుకలను లండన్ నగరంలో ఘనంగా జరిపాడు నిక్ జోనస్. పరిణీతి చోప్రా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని మొట్టమొదటిగా అందరికీ తెలియజేసింది. ఆగస్టు 18, 2018 రోజున వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేస్తున్నారు. నిశ్చితార్థం అనంతరం లాస్ ఏంజల్స్, మెక్సికో, టైప్స్ ఆఫ్ లాంటి ఎన్నో నగరాల్లో చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. డిసెంబర్ 2018 లో జోధాపూర్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ లో హిందూ క్రైస్తవ పద్ధతుల ప్రకారం రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. దాదాపు పది రోజుల పాటు జరిగిన వీరి వివాహం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


ఐతే 2017 సంవత్సరంలో వీళ్ళిద్దరూ మొట్టమొదటిగా కలిసారని అందరూ అనుకున్నారు కానీ... అంతకు మునుపు నుండే చాటింగులు చేస్తూ ఇద్దరూ కలిసి మద్యం పుచ్చుకునే వారట. ఒకానొక రోజు అందరి సమక్షంలో నిక్ జోనస్ తన మోకాళ్ళపై కూర్చుని ప్రియాంక చోప్రా కి తన లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ప్రియాంక అంగీకరించడం వాళ్ళు పెళ్ళి జరగడం చకచకా జరిగిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: