టాలీవుడ్ ఈ మద్య కాస్టింగ్ కౌచ్ పై ఎంతో మంది హీరోయిన్లు తమదైన గళం విప్పుతున్నారు.  సినీ పరిశ్రమలో ఎంతో మంది అమ్మాయిలు  మోసగాళ్ల చేతుల్లో అన్యాయంగా బలి అవుతున్నారని.. ఆఫీస్ బాయ్ నుంచి ఇండస్ట్రీలో బడా బాబుల వరకు కొత్తగా వచ్చిన అమ్మాయిలను ఎలా వాడుకోవాలా అని చూసేవారని సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవి లత.    తాజాగా మాధవీలత మొదట్లో చిన్న చిన్న పాత్రలో సినిమాల్లోకి అడుగుపెట్టి 2008లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నచ్చావులే (2008) సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత  "అరవింద్ 2" (2013) లో నటనను తిరిగి కొనసాగించింది. ఇటీవల బీజేపీ లో చేరిన ఆమె అధికార పార్టీపై పలు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

వరుసగా టాలీవుడ్‌లో జరుగుతున్న వివాహాలపై ఆమె స్పందించారు. మాస్కులు పెట్టుకొని పెళ్లీలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. దీంతో నెటిజన్లు అంతా హీరో నిఖిల్ పెళ్లి గురించేనా అంటూ ప్రశ్నించగా.. దానికి ఏమో అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.  పదిమందికి ఆదర్శంగా సినీ నటులు ఉండాలని.. కరోనా పూర్తిగా అంతరించి పోలేదు.. ఓ వైపు లాక్ డౌన్ నడుస్తుంది.. ఇలాంటి సమయంలో పెళ్లీళ్లూ పేరంటాలు ఏంటీ అంటుంది.  కొన్ని రోజుల క్రితం పెళ్లి వాయిదా వేసుకొని మళ్లీ అనుకోకుండా ఓ గెస్ట్ హౌజ్‌లో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్యలో పల్లవి వర్మను వివాహం చేసుకున్నాడు.

 

అసలు ఆగట్లేదుగా జనాలు.. మాస్క్‌లు వేసుకుని పెళ్లిళ్లు ఎందుకు. ముహూర్తం మళ్లీ రాదా. ఇది పోతే శ్రావణం.. అదీ పోతే మేఘమాసం. మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా? . కొన్నాళ్లు ఆగలేని వాళ్లు సంసారాలు చేస్తారా. నిజాలు తెలిసిపోతాయని భయమా.. మనుషులు సచ్చిపోతున్నార్రా నాయనా అంటే.. ఈ పెళ్లి ఏంటో.. నాకు అర్థం కావడం లేదు’ అంటూ ఆమె పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: