తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ జోడీగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న జోడి రామ్ చరణ్ ఉపాసన. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎంతటి గొప్ప గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక చరిత్ర సృష్టించారు. ఇక రాంచరణ్ కూడా మెగాస్టార్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే రామ్ చరణ్ అపోలో అధినేత కూతురు ఉపాసనని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా కన్నుల విందుగా జరిగింది. అయితే రామ్ చరణ్ ఉపాసన ఎప్పుడూ తమ మధ్య ఉన్న ప్రేమని సోషల్ మీడియా వేదికగా కూడా ప్రేక్షకులకు తెలుపుతూ ఉంటారు. 

 

 

 అయితే ఇద్దరు ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు... సినిమాలో హీరోగా ఓ వైపు నిర్మాతగా ఎప్పుడు బిజీ బిజీ టైం గడుపుతూ ఉంటారు రామ్ చరణ్... అదే సమయంలో తన తండ్రి అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ మంచి బిజినెస్ విమెన్ గా  గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన . ఇలా ఎవరికి వారు ఎంతో బిజీగా ఉంటారు. కానీ సమయం దొరికినప్పుడల్లా ఈ ఇద్దరూ కలిసి సరదాగా గడుపుతుంటారు. అయితే బిజినెస్ ఉమెన్ గా  ఉపాసన ఎంతో సక్సెస్ అయితే స్టార్ హీరోగా నిర్మాతగా అటు రామ్ చరణ్ కూడా సక్సెస్ అయ్యారు. అందుకే ఈ  ఇద్దరి జోడిని  టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ జోడిగా  పిలుస్తుంటారు. 

 

 

 అంతేకాదు ఉపాసన భర్త  రామ్ చరణ్ ను అమితంగా ఆరాధిస్తూ ఉంటుంది. భర్త కు సంబంధించిన ప్రతి ఈ విషయంలో ఎంతో స్పెషల్గా ఆలోచిస్తూ ఉంటుంది ఉపాసన. అంతే కాదు అటు సామాజిక కార్యకర్తగా కూడా ఉపాసన ఎన్నో సమస్యలపై ప్రస్తావిస్తూ ఉంటుంది. ఇక వీరిద్దరికీ సంబంధించిన అప్డేట్ ఏదైనా సోషల్ మీడియాలో వచ్చిందంటే మెగా అభిమానులు అందరూ మురిసిపోతుంటారు. కాగా ప్రస్తుతం వీరిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా సక్సెస్ఫుల్ జంటగా వెలుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: