బాలీవుడ్ నటి దీపికా పడుకొనే, రణవీర్ సింగ్ లను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత అన్యోన్యమైన దంపతులుగా చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య చోటుచేసుకునే కెమిస్ట్రీ అందరిని బాగా అలరిస్తాయి. దీపికా పడుకొనే అంటే రణవీర్ సింగ్ కి చచ్చెంత ఇష్టమని ఎన్నో సందర్భాలలో స్పష్టమయింది. 2013వ సంవత్సరంలో విడుదలైన గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా చిత్రంలో రణవీర్ దీపికా కలిసి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే రణవీర్ సింగ్ ఆమెపై మనసు పడ్డాడు. ఒక సినిమా కార్యక్రమంలో రణవీర్ సింగ్ మాట్లాడుతూ... దీపికా పడుకొనే మొట్టమొదటిసారిగా చూడగానే నేను ఫ్లాట్ అయిపోయాను. ఆ రోజు దీపికా సిల్వర్ కలర్ డ్రెస్ వేసుకుంది' అని చెప్పుకొచ్చాడు. దీపికా మేడం ఎప్పుడో వేసుకున్న డ్రస్సు గురించి మీకు ఇప్పటివరకు ఎలా గుర్తుంది, సార్? అని ఒక మీడియా పర్సన్ అడగగా... ఆ దృశ్యాన్ని ఎవరైనా మర్చిపోగలరా అని ఎదురు ప్రశ్న వేశాడు. యష్ రాజ్ ఫిలిం ఇండస్ట్రీలో కలుసుకున్నప్పుడు దీపికా పడుకొనే చుట్టూ తిరుగుతూ రణవీర్ సింగ్ ఎవర్నీ పట్టించుకోకుండా ఆమెతో పరాచకాలు ఆడాడు.


అంగ్ లగా దే పాటకి కొరియోగ్రఫీ చేస్తున్న సమయంలో దీపికా రణ్ వీర్ ల మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే వారిద్దరి మధ్య నిజంగానే ఏదో రిలేషన్ షిప్ ఉందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రణ్ వీర్, దీపికా పడుకొనే రెస్టారెంట్స్, ఇతర పబ్లిక్ ప్రదేశాలలో కలిసి కనిపించారు. హ్యాపీ న్యూ ఇయర్ సినిమా షూటింగు దుబాయిలో జరుగుతున్నప్పుడు... రణవీర్ సింగ్ దీపికా కోసం దుబాయ్ వెళ్లి ఆమెను కలిశాడు. దిల్ ధడక్నే దో చిత్రీకరణ నిమిత్తం రణవీర్ స్పెయిన్ వెళ్లగా... తననే కలిసేందుకు దీపికా పడుకొనే స్పెయిన్ వెళ్ళింది. అప్పట్లో ఈ వార్తలు అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చినప్పటికీ వారు మాత్రం తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో బయటపెట్టలేదు.


2015 సంవత్సరంలో IIFA అవార్డ్స్ కార్యక్రమం కొనసాగుతుండగా... మోకాళ్ళపై కూర్చుని దీపికా పడుకొనే కి అందరి సమక్షంలో తన లవ్ ప్రపోజ్ చేశాడు. కానీ తాను ఏదో సరదాకి అలా ప్రపోజ్ చేసాడు అని అందరూ భావించారు. 2018వ సంవత్సరంలో పద్మావతి సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. అప్పటికే ఇరువురు కలిసి తిరగడం సర్వసాధారణమైపోయింది. మీడియా ముందు కూడా వాళ్లు చెట్టపట్టాలు వేసుకుని తిరిగే వారు. ఎన్నో కార్యక్రమాలు హాజరై చేతులు పట్టుకొని నడిచిన సందర్భాలు కోకొల్లలు. పద్మావతి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన తర్వాత తమ రిలేషన్ షిప్ గురించి అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 14, 2018 వ సంవత్సరంలో ఇటలీలోని లేక్ కంబో వద్ద పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: