నానీ... టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో ఎవరు సంపాదించని క్రేజ్ ని సంపాదించిన హీరో. ఏ స్టార్ హీరోకి కూడా ఇంత తక్కువ కాలంలో క్రేజ్ రాలేదు అని చెప్తూ ఉంటారు. ప్రతీ సినిమా విషయంలో అతను తీసుకునే జాగ్రత్తలు అతను పడిన కష్టం గురించి చాలా గొప్ప గా చెప్తూ ఉంటారు. అగ్ర నటుడు అయిన తర్వాత కూడా అతను సినిమాల విషయంలో చాలా కష్టాలు పడ్డాడు అనేది టాలీవుడ్ లో కొందరు చెప్పే మాట. ఇది పక్కన పెడితే అతని కెరీర్ కి భార్య అంజన నుంచి చాలా హెల్ప్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. 

 

నానీ మీద కొందరు అనవసర విమర్శలు చేసే వారు అని ఆమె వాటిని పట్టించుకోకుండా నానీ ని ముందుకు నడిపించారు అనేది టాలీవుడ్ లో చెప్పే మాట. ఆమె నానీ కోసం చాలా వరకు కష్టపడిన సందర్భాలు ఉన్నాయి అని అంటారు. ఇప్పటికి నానీ చేసే వ్యాపారాల మీద ఆమె పెత్తనమే ఎక్కువగా ఉంటుంది అని అంటారు. ఆమె మాట కాదని నానీ ఏదీ చేసే ప్రయత్నం కూడా చేయదు అనేది కొందరి మాట. ప్రస్తుతం అతని కెరీర్ చాలా పీక్స్ లో ఉంది. డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన హీరో గా నానీ కి మంచి పేరు కూడా ఉంది. 

 

దీనికి కారణం కచ్చితంగా భార్య మద్దతు అనేది టాలీవుడ్ మాట. ఆమె ప్రతీ ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుని నానీకి మద్దతు ఇస్తూ ఉంటారని దర్శకులు చెప్పే కథలు ఆమె కచ్చితంగా విన్న తర్వాతే నానీ ని సినిమాకు ఒప్పించే ప్రయత్నం చేస్తారని అంటూ ఉంటారు. కాగా నానీ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు అన్నీ వచ్చే ఏడాది వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: