సాధారణంగా హీరోయిన్ల కెరీర్ పెళ్లికి ముందు ఒకలా.. పెళ్లి తర్వాత ఒకలా ఉంటుంది. మ్యారేజ్ తర్వాత హీరోయిన్ల కెరీర్ స్లో అవుతుంది. ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కడం చాలా కష్టం. కానీ ప్రియమణి మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్  ప్లే చేస్తోంది. వైవిధ్యమైన పాత్రలతో సకెండ్ ఇన్నింగ్స్ ను పవర్ ఫుల్ గా మలుచుకుంటోంది. బాలీవుడ్ కెరీర్ ని ఎక్స్ పాండ్ చేసుకుంటోంది ప్రియమణి. 

 

ప్రియమణి పెళ్లి తర్వాత చాలా స్లో అయిపోయింది. వెండితెరపై అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపైకి వెళ్లిపోయింది. రియాలిటీ షోస్ తో  బిజీగా ఉంది. అయితే నారప్పతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి వస్తోంది ప్రియమణి. తమిళ హిట్ అసురన్ రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా నటిస్తోంది ప్రియమణి. 

 

రానా విరాటపర్వంలోనూ నటిస్తోంది ప్రియమణి. వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సలైట్  పోరాటాల నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తోందట ప్రియమణి. ఇక తెలుగులో భిన్నమైన పాత్రలు పోషిస్తోన్న ప్రియమణి తర్వాత బాలీవుడ్ ను టార్గెట్ చేస్తోంది. అక్కడా కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. 

 

ప్రియమణి బాలీవుడ్ లోనూ సందడి చేయాలనుకుంటోంది. ఆల్ రెడీ షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ ప్రెస్ లో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే రక్తచరిత్ర 2, రావణ్ లాంటి మల్టీ లింగ్వల్స్ తో హిందీ జనాలను పలుకరించింది. వీటితో పాటు ఫ్యామిలీ లీమెన్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది  ప్రియమణి. సో ఈ సినిమాలు, వెబ్ సిరీస్ తో వచ్చిన గుర్తింపుతో బాలీవుడ్ లోనూ సందడి చేయాలనుకుంటోంది. మరి ఈ కన్నడ బ్యూటీని ఎవరు బాలీవుడ్ కు తీసుకెళ్తారో చూడాలి. 

 

మొత్తానికి పెళ్లి తర్వాత  ప్రియమణి సినిమా కెరీర్ కాస్త స్లో అయినా ఇపుడు మళ్లీ పుంజుకుంటోంది. వెంకటేశ్ కు జోడీగా నటిస్తున్న ప్రియమణి సినీ కెరీర్ ఎలా సాగుతుందో చూద్దాం..  

మరింత సమాచారం తెలుసుకోండి: