పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా ఫిక్స్ అయినా.. ఈ హిట్ కాంబినేషన్ తెరపైకి రావాలంటే ఏడాది పడుతుంది. ఈలోగా మరో సినిమా చేయనంటున్నాడు హరీష్ శంకర్. అయితే ఈ ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా. కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాడు హరీష్ శంకర్. 

 

ఫ్లాపుల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ కు హిట్ తీసుకొచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. హిందీ సినిమా దబాంగ్ కు రీమేకే అయినా.. పవన్ ఇమేజ్ కు కొత్త హంగులు దిద్ది సక్సెస్ అయ్యాడు హరీష్. ఎనిమిదేళ్ల తర్వాత ఈ హిట్ కాంబినేషన్ ను మైత్రీ మూవీస్ మేకర్స్ రిపీట్ చేసింది. పవన్ కళ్యాణ్ డేట్స్ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర ఉండగా.. దర్శకుడిగా హరీష్ పేరును రికమెండ్ చేశారు నిర్మాతలు. హరీష్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఓకే అయింది. 

 

ప్రస్తుతం పవన్ నటిస్తున్న రెండు సినిమాలు రిలీజ్ అయితే గానీ.. హరీష్ శంకర్ మూవీ మొదలు కాదు. వకీల్ సాబ్ ఇంకా 10రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ తర్వాత క్రిష్ మూవీలో పవన్ జాయిన్ అవుతాడు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వకీల్ సాబ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. దాదాపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినా త్వరలో పవన్ కు పూర్తి కథ వినిపిస్తాడు. 

 

పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ నెలరోజుల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత దేవీశ్రీప్రసాద్ తో మ్యూజికల్ సిట్టింగ్స్ లో పాల్గొంటాడు హరీష్. 10.. 15 రోజుల్లో ట్యూన్స్ కూడా వచ్చేస్తాయి. పవన్ సినిమా మొదలు పెట్టడానికి ఏడాది గ్యాప్ వచ్చినా.. మరో మూవీ చేయాలనుకోవడం లేదు. అయితే క్రిష్ తో కలిసి కొన్ని వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తానని చెప్పాడు హరీష్. ఇలా ఖాళీ లేకుండా బిజీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు హరీష్. 


హరీష్ శంకర్ సినిమా కథ ఎలా ఉన్నా.. కామెడీ ఉండాల్సిందే. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ అయినా.. ఎన్టీఆర్ తో చేయించిన కామెడీ అలరించింది. పవన్ తో తీసే రెండో సినిమా పక్కా ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటుందంటున్నారు. కామెడీని ఇంతగా ఇష్టపడే హరీష్.. పాత సినిమాను రీమేక్ చేయాల్సి వస్తే రౌడీ అల్లుడును ఎంచుకుంటానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చిరంజీవితో ఛాన్స్ వస్తే.. ఇలాంటి ఎంటర్ టైన్ మెంట్ స్టోరీనే రాసుకుంటాడేమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: