టాలీవుడ్ లో అత్యంత ప్రతిభ ఉన్న నటులలో ఈ తరానికి సంబంధించి ఎక్కువగా రామ్ చరణ్ ని చెప్తూ ఉంటారు. అతని కెరీర్ లో ఏ సినిమా కూడా తండ్రి మీద ఆధార పడి చేసిన సందర్భం అనేది లేదు అనే చెప్పవచ్చు. యువ దర్శకులు సీనియర్ దర్శకులకు ఆయన ఎప్పటికప్పుడు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. ప్రతిభ ఉంటే చాలు ప్రయోగం చేయడానికి అయినా సరే తనకు ఏ మాత్రం ఇబ్బంది లేదు అని చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఒక యువ దర్శకుడు వచ్చి కథ వినిపించగా తాను సినిమా చేస్తాను అని రామ్ చరణ్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

టాలీవుడ్ లో ఇప్పుడు యువ హీరోలు చాలా మంది ప్రయోగాలూ చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచన చేసే పరిస్థితి ఉంది టాలీవుడ్ లో అనేది వాస్తవం. కాని రామ్ చరణ్ విషయంలో మాత్రం ఇది నిజం కాదనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రతిభ ఉంటే చాలు ఎవరికి అయినా అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక కాలేజి స్టూడెంట్ చెప్పిన కథ విని రామ్ చరణ్ ఫిదా అయిపోయాడు అని అంటున్నారు. కథ విని సినిమా చేయడానికి ఓకే చేసాడు అని సమాచారం. కథ మొత్తం విన్న తర్వాత సినిమా బడ్జెట్ ఎంత అవుతుంది అని కూడా సదరు స్టూడెంట్ ని అడిగినట్టు తెలుస్తుంది.

 

సోషల్ మీడియా ద్వారా అతను రామ్ చరణ్ తో మాట్లాడినట్టు సమాచారం. అన్నీ బాగున్నాయి అనుకుంటే అతనితో ఇప్పుడు సినిమాను ఓకే చేసే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. యువ దర్శకుడి తో అతని సినిమా ఉంటుంది అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని పరిణామాలు చూస్తే అది నిజమే అని అంటున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: