టాలీవుడ్ లో ప్ర‌స్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదు. అల్లు అర్జున్ ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా త‌ర్వాత తిరుగులేని హీరో అయిపోయాడు. ఈ సినిమా నాన్ బాహుబ‌లి రికార్డుల‌కు పాత రేసి టాలీవుడ్ మిగిలిన హీరోల రికార్డుల‌కు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇక ఈ సినిమా హిట్ అయిన జోష్‌లో ప్ర‌స్తుతం పుష్ప సినిమా కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు అని బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఏదోక వార్త పుష్ప సినిమా గురించి వస్తూనే ఉంది. 

 

పుష్ప సినిమా విషయంలో సుకుమార్ ఆలోచనకు తగిన విధంగా నటించే ప్రయత్నం చేయడానికి గానూ ఇప్పుడు బన్నీ నానా కష్టాలు పడుతున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పుష్ప‌ సినిమాలో అతని పాత్ర చాలా బాగుంటుంది టాక్. ఇది పక్కన పెడితే ఇప్పుడు పుష్ప సినిమా కోసం అతను ఒక ప్రయోగం చేయడానికి సిద్దమవుతున్నట్టు సమాచారం. అతని ఒంటి మీద గాట్లు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఏమీ లేదు ఈ సినిమాలో... ఒక సన్నివేశంలో ఎర్ర చందనం చెట్ల కోసం వెళ్ళినప్పుడు వేరే వర్గం వచ్చి వీళ్ళను నరుకుతుంది అని అప్పుడు బన్నీ వీపు మీద పెద్దగా గాయం అవుతుంది అని తెలుస్తుంది. 

 

అయితే ఆ గాయం మెడ మీద నుంచి కింద వరకు ఉంటుంది అని చొక్కా లేకుండా కొన్ని సన్నివేశాల్లో నటించాలి అని, అతనిని పోలీసులు గుర్తించడానికి ఆ గాయాన్ని కూడా పరిగణ లోకి తీసుకుంటారు అని అందుకే అతను గాయం కోసం ఇప్పుడు కష్టపడుతున్నాడు అని తెలుస్తుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ లాక్‌డౌన్ నేప‌థ్యంలో అనుకున్న డేట్‌కు వస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: