తళుకుబెళుకుల తమన్నాకు ఫ్యాన్స్ వీర లెవెల్లో ఉన్నారు. మూడున్నర పదుల వయసు ఉన్న ఈ ముద్దు గుమ్మ తన గ్లామర్ తో ఇంకా యూత్ ని పిచ్చెక్కిస్తూనే ఉంది. అమ్మడుకు ఆఫర్లు కూడా అలా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఏజ్ హీరోలు, సీనియర్ హీరోలు తమన్నా కోసం వెయిట్ చేస్తున్నారు.

 

అయితే తమన్నా ఎవరికీ ఎస్ అనకుండా అలా అని నో చెప్పకుండా చాలా తెలివిగా మ్యానేజ్ చేస్తోందని అంటున్నారు. తమన్నా ఓకే నటిస్తాను అంటూనే తన భారీ పారితోషికంతో ఖంగు  తినిపిస్తోందిట. ఇలా ఒక సీనియర్ హీరోకు జరిగినట్లుగా న్యూస్ వైరల్ అయింది. ఆ దెబ్బకు ఆ సినిమా యూనిట్  అంత సొమ్ము ఇవ్వలేమని పక్కకు తప్పుకున్నారని కూడా టాక్ నడిచింది.

 

ఇక ఇపుడు చూసుకుంటే తమన్నా మరో హీరో సినిమా విషయంలోనూ భారీ డిమాండ్ పెట్టిందట. ఆ హీరో ఎవరో కాదు, రవితేజా. ఆయనకు కొన్నాళ్ళుగా సరైన హిట్లు లేవు. అయితే ఆయన కొత్త మూవీకి తమన్నాను హీరోయిన్ గా అనుకుంటున్నారు. తమన్నా కూడా ఓకే చెప్పింది. ఇపుడు రెమ్యునరేషన్ విషయంలోనే తేడా కొడుతోందిట.

 

ఈ మూవీలో యాక్ట్ చేసేందుకు తమన్నా ఏకంగా మూడు కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇది మరీ టూ మచ్ అని చిత్ర యూనిట్ ఫీల్ అవుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. తమన్నా కంటే కూడా చాలా మంది హీరోయిన్లు ఇపుడు కొత్తగా వచ్చేశారు. టాలెంట్ చూపిస్తున్నారు. అయితే సీనియర్ హీరోయిన్ గా తమన్నా కాస్త తగ్గుతుందేమోనని చూస్తే ఏకంగా మూడు కోట్లు అని చెప్పడంతో బాబోయ్ అంటున్నారుట.

 

నిజానికి రవితేజాకు తమన్నా గుడ్  ఫ్రెండ్ గా ఉంది. ఈ ఇద్దరూ కలసి బెంగాల్ టైగర్ మూవీలో నటించారు. ఆ సినిమా హిట్ అయింది కూడా. ఆ సెంటిమెంట్ తోనే ఈ జోడీని తెర ముందుకు తెస్తున్నారు. మరి తమన్నా ఇంత పెద్ద మొత్తం చెప్పడం వెనక్కు తగ్గేది లేదనడంతో నిర్మాతలు ఏంచేస్తారో చూడాలి  ఏది ఏమైనా ఈ మధ్య తమన్నా కో అంటే కోటీ అంటూ గట్టిగానే కొడుతోందని టాక్ వినిపిస్తోంది.

 

మరి ఆమె డిమాండ్  ఆ లెవెల్లో ఉందా, లేక ఆయా హీరోల సినిమాలకు తన  అవసరం తప్పనిసరిగా  ఉందని అడుగుతోందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైతేనేం ఇండస్ట్రీకి వచ్చిన పదిహేనేళ్ళ తరువాత తమన్నా భారీగానే రేటు పెంచిందని అంటున్నారుట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: