ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా మాత్రమే అనుకునే ప్రపంచానికి బాహుబలి ద్వారా మేమూ ఉన్నాం.. అని సమాధానం చెప్పింది టాలీవుడ్. హిందీ నటులకు కూడా అలాంటి ప్రాముఖ్యం దక్కేది. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది తెలుగు సినిమాలనే. ఇప్పుడు కరోనా పరిస్థితులు తెలుగు సినిమాకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నాయని చెప్పాలి. అది కూడా ఇతర దేశాల క్రికెటర్ల రూపంలో. ఇందుకు ఊతమిచ్చింది మన తెలుగు సినిమా ‘అల.. వైకుంఠపురములో’. బన్నీ హీరోగా వచ్చిన ఈ సినిమాలోని పాటలు సృష్టించిన, సృష్టిస్తున్న సంచలనాలు గురించి తెలసిందే.

 

 

యూట్యూబ్ లో రఫ్ఫాడేస్తున్న ఈ పాటలను ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన టిక్ టాక్ వీడియోలతో ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం కల్పించేశాడు. భార్య పిల్లలతో కలిసి ‘బుట్టబొమ్మ, రాములో రాములా’ పాటలకు చేసిన డ్యాన్సులు సంచలనం క్రియేట్ చేశాయి. ఇది చూసి ఇంగ్లాండ్ క్రికెటర్ పీటర్సన్ జెంటిల్ మెన్ తెలుగు వెర్షన్ లో ‘బుట్టబొమ్మ, కొంటెగాడ్ని కట్టుకో’ పాటకు డ్యాన్స్ చేశాడు. ఇలా తెలుగు సినిమా పాటలను దశదిశలా మోగించేస్తున్నారు. భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మకే ఇండియాలో సంచలనం సృష్టించిన తెలుగు పాట గురించి ఆస్ట్రేలియా క్రికెటర్ చెప్పడం విశేషం. దీంతో తెలుగు సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసినట్టైంది.

 

 

అల.. వైకుంఠపురములోని ‘బుట్టబొమ్మ,’, ‘రాములో రాములా’ పాటలు ఇప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. రాములో రాములా పాటను రీసెంట్ గా వార్నర్ చాలా స్టైలిష్ గా చేసిన టిక్ టాక్ వీడియో మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్లకే పరిమితమైన క్రికెటర్స్ ఇలా సందడి చేయడం విశేషం. క్రికెటర్స్ అంటే దాదాపు క్రికెట్ ఆడే దేశాలన్నింటికీ మన తెలుగు పాటలు వెళ్లిపోయినట్టే. ఈరకంగా క్రికెటర్స్ తెలుగు సినిమాకు మంచి ఫేవర్ చేస్తున్నట్టే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Woke the beast 😂😂 what can you see with your eyes at the end?? #challenge #gettingbetter #fun #justsmile

A post shared by David Warner (@davidwarner31) on

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: