జెంటిల్ మాన్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవ కుశ, 118, బ్రోచేవారెవరురా..ఇలా వరసగా సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే మద్యలో చిన్న గ్యాప్ రావడంతో ఇక నివేదాకి సినిమాలు లేవా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కాని చాలామందికి ప్రస్తుతం నివేదా చేస్తున్న సినిమాల లెక్క తెలియక అలా అనుకున్నారు. ప్రస్తుతం నివేదా థామస్ చేతిలో వరసగా భారీ సినిమాలే ఉన్నాయి.

 

రీసెంట్ గా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ లో నటించింది. ఈ సినిమా తెలుగు తమిళంలో రిలీజవగా నివేదా థామస్ క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ సినిమా వకీల్ సాబ్ లో నటిస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ నివేదా దే పవర్ ఫుల్ క్యారెక్టర్. ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ నివేదా కి గొప్ప పేరు తీసుకు వస్తుంది. ఇదే క్యారెక్టర్ తో తాప్సీ బాలీవుడ్ లో నటిగా గొప్ప పేరు సంపాదించుకుంది.

 

ఇక ఈ సినిమాతో పాటు నాని నటించిన వి సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ బాబు, అదితీ రావు హైదరీ నటించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

 

ఇక సుకుమార్ అల్లు అర్జున్ సినిమాలో కూడా నివేదా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు కిషన్ కట్ట దర్శకత్వం వహిస్తున్న సినిమాతో పాటు స్వామి రా రా, కేశవ, రణరంగం ఫేం సుధీర్ వర్మ దర్శకత్వం వహించబోయో సినిమాలోను నటించబోతుంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: