తెలుగు సినీ పరిశ్రమలో ఒక హీరో, ఒక డైరెక్టర్ తో చేసిన సినిమా హిట్ అయితే ఇక వారిని హిట్ కాంభినేషన్  అంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇటువంటి హిట్ ఫెయిర్ సినిమాలే ఎక్కువగా రావడం చూస్తున్నాం. అయితే ఇది ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో పరిశ్రమలో కొనసాగుతుంది. అప్పట్లో ఎన్టిఆర్, కే. రాఘవేంద్ర రావు ల కామ్భినేషన్ హిట్ గా నిలిచింది. వీరిద్దరూ కలిసి చేసిన అన్ని సినిమాలు దాదాపు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

 

నందమూరి తారక రామారావు అంటే తెలియని తెలుగు వారుండరు. అయితే ఆయన రాజకీయంగానే కాక నటనతో కూడా అశేష అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించారు. అయితే అప్పట్లో ఎన్టిఆర్, రాఘవేంద్ర రావు కామ్భినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. అడవి రాముడు తో మొదలైన వీరి కామ్భినేషన్ మేజర్ చంద్ర కాంత్ సినిమా వరకు కొనసాగింది. వీరు ఇద్దరివి కలిసి దాదాపు 12 సినిమాలు తెరపైకి రాగా అందులో 10 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి.

 

కే. రాఘవేంద్ర రావు, ఎన్టిఆర్ కాంభినేషన్లో వచ్చిన తొలి చిత్రం 1977 లో వచ్చిన అడవి రాముడు. ఈ సినిమాలో ఎన్టిఆర్ సరసన జయ సుధా, జయ ప్రద నటించారు. ఈ సినిమాతో  వీరిద్దరూ టాప్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాక ఈ సినిమా అప్పట్లోనే కోటి కి పైగా షేర్స్ సాధించిన ఘనత దక్కించుకుంది. ఎన్టిఆర్ సినీ ప్రస్థానానికి ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. అయితే వీరి కాంభోలో ఇంకా డ్రైవర్ రాముడు, సత్యం శివం, వేటగాడు, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్ వంటి హిట్ లు ప్రేక్షకులను కట్టి పడేశాయి. సంగీతం పరంగా కూడా ఈ సినిమాలు ప్రేక్షకులకు చేరువయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: