తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులకు స్నేహితులు ఉండటం సహజమే. కొందరికి ఇండస్ట్రీకి వచ్చాక స్నేహితులు అవుతారు. మరికొందరు పరిశ్రమకు రాకముందే స్నేహితులుగా ఉండి సినిమాల్లోకి వచ్చాక వారి స్నేహం మరింత ముందుకు వెళుతుంది. అటవంటి వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆర్ట డైరక్టర్ ఆనంద్ సాయి కూడా ఉంటారు. ‘మేమిద్దరం సినిమాల్లోకి రాకముందు చెన్నైలో కలిసే ఉండేవాళ్లం. నాకు ఉన్న అతికొద్దిమంది ఫ్రెండ్స్ లో ఆనంద్ సాయి ఫస్ట్ పర్సన్’ అని పవన్ కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా.

 

 

నిజానికి పవన్ కు చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఆనంద్ సాయికి ప్రముఖ ఆర్ట్ డైరక్టర్ చలం కుమారుడిగా ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. వీరంతా చెన్నైలో ఉన్నప్పుడు పవన్ఆనంద్ సాయి మధ్య ఓ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ లో జరిగిన పరిచయం ఫ్రెండ్షిప్ గా మారింది. పవన్ సినిమాల్లోకి వచ్చే సమయానికి ఆనంద్ సాయి ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఉన్నాడు. తండ్రి ప్రముఖ ఆర్ట్ డైరక్టర్ అయినా ఆనంద్ కు అటువైపు ఆలోచనలు లేవు. కానీ, ఆనంద్ లోని ఆర్ట్ గుర్తించిన పవన్ తప్పనిసరిగా సినిమాలు చేయాలని ఎంకరేజ్ చేశాడు. దీంతో తొలిప్రేమ సినిమాలో ఓపాటలో తాజ్ మహల్ సెట్ వేసి సక్సెస్ అయ్యాడు.

IHG's Film

 

రియల్ లైఫ్ లో మొదలైన వీరి స్నేహం రీల్ లైఫ్ లో కూడా చాలా కొనసాగింది. వృత్తిపరంగానే కాక జీవితంలో కూడా పవన్ అభిమానించే స్నేహితుడిగా వీరికి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆనంద్ సాయి సినిమాలకు పని చేయకపోయినా పవన్ఆనంద్ సాయి మధ్య స్నేహం మాత్రం కొనసాగుతోంది. వీరి స్నేహం గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూంటారు. తరచుగా తామిద్దరం కలుస్తూ ఉంటామని ఆమధ్య చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: