సెలబ్రిటీల ఫ్రెండ్ షిప్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలతో పోటీ పడుతూ వారి స్నేహాన్ని చాటుతారు. తెలుగు సినీ పరిశ్రమలో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు లవర్ బోయ్ నితిన్, అక్కినేని అఖిల్. ఎలా కుదిరిందో తెలియదు కానీ అఖిల్, నితిన్ ల ఫ్రెండ్ షిప్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అంతేకాదు అఖిల్ ను ఇంట్రడ్యూస్ చేసింది నితినే. నితిన్ నిర్మాణంలోనే అఖిల్ సినిమా వచ్చింది. 

 

సినిమా ఫలితం ఎలా ఉన్నా వీళ్ళ స్నేహం మాత్రం అలానే ఉంది. పక్కా పవర్ స్టార్ అభిమాని అని చెప్పుకునే నితిన్ అఖిల్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు. వీళ్లిద్దరు కలిస్తే ఆ హంగామా వేరేలా ఉంటుందని తెలుస్తుంది. సినిమా షూటింగ్ లేకుంటే నితిన్ అఖిల్ కలిసి టైం స్పెండ్ చేస్తాడని తెలుస్తుంది. మొత్తానికి నితిన్ అఖిల్ ల స్నేహం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. నితిన్ కూడా అఖిల్ సక్సెస్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. 

 

ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ నితిన్ అఖిల్ సినిమా నిర్మించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అఖిల్ హిట్ కొడితే అక్కినేని ఫ్యామిలీ కన్నా నితిన్ ఎక్కువ ఆనందపడతాడు. మరి అఖిల్ నితిన్ స్నేహం ఇలానే కొనసాగాలని ఆశిద్దాం. భీష్మ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చిన నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. వీళ్ళ స్నేహం కేవలం ఆఫ్ స్క్రీన్ వరకే కాకుండా మంచి కథతో ఆన్ స్క్రీన్ పై కూడా ప్రేక్షకులకు కనిపించేలా చేస్తే బెటర్. అదేనండి నితిన్ అఖిల్ మల్టీస్టారర్ సినిమా చేస్తే బాగుంటుందని టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: