రానా ఇంటీరియర్ డిజైనర్ మిహీకా బజాజ్‌ ను ప్రేమించే పెళ్ళి చేసుకోబుతున్నాడు అని రానా వైపు నుంచి ప్రకటన రావడంతో ఇప్పుడు మీడియాలో మిహికా బజాజ్ హాట్ టాపిక్ గా మారి ఆమెకు సంబంధించిన వీడియోలు ఫోటోలను అందరు తెగ ఆసక్తిగా చూస్తున్నారు. వీరి వివాహాన్ని సురేష్ బాబు కుటుంబం అంగీకరించడంతో ఈ లాక్ డౌన్ హడావిడి ముగిసిన తరువాత జరగబోయే పెద్ద స్టార్ వెడ్డింగ్ కార్యక్రమంగా ఇది మారుతోంది.


ఇది ఇలా ఉండగా మిహీక పెళ్ళికి దగ్గుబాటి కుటుంబం ఓకె చేయడానికి ఒక విధంగా అనుష్క నగలు కారణం అన్న న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిహికా కుటుంబానికి రానా కుటుంబానికి ఎప్పటి నుండో సాన్నిహిత్యం ఉందట. మిహీక తల్లి, బంటీ బజాజ్ నగల డిజైనర్ గా పనిచేసింది. ఆమె ‘నాగవల్లి’ సినిమాలో వెంకటేష్ అనుష్క ఆభరణాలను డిజైన్ చేసింది.


అప్పట్లో మిహీక కూడా తన తల్లికి సాయం చేస్తూ ‘నాగవల్లి’ సినిమా షూటింగ్ స్పాట్ కు వచ్చేదట. అప్పుడు వెంకటేష్ మిహీకా ఉత్సాహాన్ని చూసి ఆమెను ప్రోత్సహించడమే కాకుండా ఆమెను వెంకటేష్ రానా కు పరిచయం చేసాడట. అప్పటి నుండి రానా, మిహీకా లకు సాన్నిహిత్యం ఏర్పడి ఆతరువాత ఆ పరిచయం ప్రేమగా మారిందట. మిహీకా ముంబైలోని డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను రన్ చేస్తోంది.


భారతీయ వాస్తు శాస్త్రాన్ని ఎంతో ఇష్టపడే మిహిక ముంబాయిలోని రచన సంసద్ విద్యాలయం నుంచి ఇంటీరియల్ డిజైనింగ్‌ లో డిప్లొమా పొందింది. అంతేకాదు లండన్‌ లోని చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనింగ్‌ లో మాష్టర్ కోర్స్ చేసింది. ఇలా పరోక్షంగా వెంకటేష్ వీరిద్దరి ప్రేమకు పరిచయకర్తగా మారడమే కాకుండా వెంకటేష్ అనుష్క లు నటించిన ‘నాగవల్లి’ సినిమా కూడ రానా ప్రేమకు సహకరించింది అని అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: