త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జల్సా సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, ఇలియానా హీరో హీరోయిన్లగా నటించగా... ఇది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. వాస్తవానికి మహేష్ బాబు పవన్ సినిమా కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పట్లో వారి స్నేహబంధానికి పట్టుగొమ్మగా నిలిచింది. పవన్ హీరోగా నటించిన కొమరం పులి మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా... మహేష్ బాబు తన సినిమాని వాయిదా వేసుకున్నాడు. కొమరం పులి మూవీ కి పోటీగా తన సినిమా రాకూడదనే మహేష్ బాబు తన సినీ చిత్ర బృందంతో మాట్లాడి మరీ తన సినిమాని వాయిదా వేసుకున్నాడట.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ప్రచారాలకు మహేష్ బాబు హాజరవ్వగా... మహేష్ సినిమాలకు పవన్ ప్రచారం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇరువురి ఫ్యామిలీ ఫంక్షన్స్ లలో కూడా పవన్, మహేష్ పాల్గొనేవారు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అభిమానులు ఫ్లెక్సీ ల విషయంలో చొక్కాలు చించుకుని విపరీతంగా కొట్టుకున్నారు. కానీ వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడడంతో ఆయన అభిమానుల మధ్య ఘర్షణలకు చోటు లేకుండా పోయింది.


గతంలో స్టార్ హీరోల మధ్య తగాదాలు, ఇగోలు ఉన్నట్టు ఇప్పటి తరం హీరోల్లో అలాంటివి ఏ మూలన లేవని స్పష్టం గా చెప్పుకోవచ్చు. మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమా పైరసీ సీడీలు బయటకు రాగా... పైరసీ పై పోరాటం చేస్తున్న మహేష్ పవన్ కళ్యాణ్ ఎంతో సహాయపడ్డాడు. హైదరాబాద్ నగరంలో వీళ్లిద్దరూ కలసి పైరసీ కి చెక్ పెట్టేందుకు కృషి చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ పై మహేష్ బాబు కు ఎనలేని ప్రేమ ఆప్యాయత కలిగింది. ఒకానొక సందర్భంలో ఈ విషయాన్ని మహేష్ బాబు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఒకవేళ వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తే అభిమానులకు కన్నుల విందు అవుతుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: