టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యువ హీరో శర్వానంద్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులని ఎంతమందికి తెలుసు. రామ్ చరణ్, శర్వానంద్ ఇద్దరు క్లాస్ మేట్స్ ఇద్దరు కొన్నాళ్ళు కలిసి చదువుకున్నారు. వీళ్ళతో పాటు రానా కూడా కలిసి చదివాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో వీళ్ళు చదువుకున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ తో చాల క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉన్నా సరే శర్వానంద్ తన ఇమేజ్ పెంచుకునేందుకు రామ్ చరణ్, రానాలను వాడుకోవాలని అనుకోలేదు. 


ఎవరి సినిమాలు వారు చేస్తూ సినిమాలు కాకుండా బయట కలిసినప్పుడు ఏరా అనుకునేంత చనువు వారి మధ్య ఉందని చెప్పొచ్చు. చిన్నప్పటి స్నేహితులు అంటే ఇక వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళు కలిస్తే చేసే అల్లరి హంగామా లెక్క వేరేలా ఉంటుంది. రెగ్యులర్ గా కాకపోయినా రామ్ చరణ్, శర్వానంద్, రానా లు అప్పుడప్పుడు కలుస్తుంటారు. వీళ్ళు కలిస్తే సినిమాల గురించి కాకుండా మిగతా విషయాల గురించి మాట్లాడుతారని తెలుస్తుంది. 


సినిమాల మీద వీళ్ళ ఫ్రెండ్ షిప్ ఎఫెక్ట్ పెద్దగా కనిపించదు. శర్వానంద్ తన పంథాలో సినిమాలు చేస్తూ వెళ్తుంటాడు. కనీసం ప్రమోషన్స్ లో కూడా రామ్ చరణ్ ను వాడుకోవాలని అనుకోడు. యువ హీరోల్లో టాలెంట్ ఉన్న నటుడిగా శర్వానంద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా హీరోగా వచ్చి సత్తా చాటుతున్నాడు శర్వానంద్. 


తాను చేసే ప్రతి సినిమా స్పెషల్ గా ఉండాలని కోరుకునే శర్వానంద్ స్టార్ ఇమేజ్ సంపాదించడంలో వెనుకపడ్డాడు. మరి రానున్న రోజుల్లో తన స్నేహితుల సాహంతో ఆ క్రేజ్ తెచ్చుకుంటాడేమో చూడాలి. రియల్ ఫ్రెండ్స్ అయినా రామ్ చరణ్, శర్వానంద్ రీల్ లో కూడా స్నేహితులుగా నటించే ఛాన్స్ వస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. మరి అలాంటి కథ వస్తే ఈ ఫ్రెండ్స్ మల్టీస్టారర్ మనం చూసే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: