మన తెలుగులో స్టార్ హీరోలు గా ఒక వెలుగు వెలిగింది వెంకటేష్ చిరంజీవి. ఇద్దరూ కూడా టాలీవుడ్ లో తమ మార్క్ వేసారు కొన్ని దశాబ్దాలు. వీరి సినిమా వస్తుంది అంటే అభిమానుల్లో ఒకరకమైన క్రేజ్ అనేది ముందు నుంచి ఉండేది. వీరి సినిమా కోసం దర్శక నిర్మాతలు కూడా చాలా ఆశగా ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. ఇద్దరూ కూడా కెరీర్ లో ఎన్నో విజయాలను చూసారు. ఇక వీరి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ముందు నుంచి కూడా ఇద్దరూ మంచి స్నేహితులు అని అంటారు టాలీవుడ్ జనం. 

 

ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది అని చెప్తూ ఉంటారు. ఏ కష్టం వచ్చినా సరే ఒకరికి ఒకరు అండగా నిలబడే వారు అని ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళడమే కాదు సినీ పరిశ్రమలో జరిగే ప్రతీ ఒక్కటి కూడా వీళ్ళు మాట్లాడుకునే వాళ్ళు అలాగే ఒకరికి ఆర్ధిక కష్టాలు వచ్చిన సమయంలో మరొకరు అండగా నిలబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. వెంకటేష్ అయితే చిరంజీవి ని  తన సొంత అన్నగా చూస్తూ ఉంటారని ఒకప్పుడు ఇద్దరూ వారాంతం కలిసి అన్నీ మాట్లాడుకునే వారు అని కాని ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు అని చిరంజీవి కలవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వారు అని చెప్తూ ఉంటారు. 

 

రామా నాయుడు కూడా చిరంజీవి వ్యక్తిత్వం నచ్చి ఎక్కువగా మాట్లాడే వారు అని కొన్ని రోజుల పాటు చిరంజీవి కి దగ్గుబాటి కుటుంబం ఆర్ధికంగా సహకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటారు. చిరంజీవి ఒకానొక సమయంలో పైకి చెప్పుకోలేని విధంగా ఇబ్బందులు పడ్డారట. ఆ సమయంలో వీళ్ళే అండగా నిలబడ్డారు అని అంటూ ఉంటారు. ఏది ఎలా ఉన్నా వీళ్ళు మంచి స్నేహితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: