మన తెలుగులో స్టార్ హీరోల మధ్య ఆధిపత్య పోరు అనేది ఎప్పటి నుంచో ఉంది అనేది మనం వింటూ ఉంటాం. చిన్న హీరో పెద్ద హీరో మధ్య ఏమీ ఉండదు గాని పెద్ద హీరో పెద్ద హీరో మధ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కాని వాస్తవం వాళ్ళ జీవితంలో అభిమానులు తీసుకొచ్చిన ఆధిపత్య పోరే గాని వాళ్ళు ఎప్పుడు కూడా అలా కనపడిన సందర్భాలు అనేవి లేవు అనేది వాస్తవం. ఎవరికి తోచిన తప్పుడు ప్రచారాలు వాళ్ళు చేయడమే గాని వాస్తవం గా మాత్రం అలాంటిది ఏదీ ఉండదు అనేది చాలా మందికి తెలియదు కూడా. 

 

మన తెలుగులో ఎక్కువగా ప్రభావం చూపించిన నటులు శోభన్ బాబు ఎన్టీఆర్. వీరి ఇద్దరి సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులకు ఒకరకంగా పండగా వాతావరణం ఉండేది అప్పట్లో. మహిళా ప్రేక్షకులు అయితే వీరి సినిమాల కోసం పనులు మానుకుని చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కూడా. కాని వీరి మధ్య ఆధిపత్య పోరు అంటూ ఎన్నో ప్రచారాలు చేసే వారు అయితే వ్యక్తిగత జీవితంలో శోభన్ బాబు ప్రతిభ ను గమనించి ఎన్టీఆర్ ఎంతగానో ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం శోభన్ బాబు చాలా సార్లు చెప్పారు కూడా. 

 

తాను నేడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే కచ్చితంగా ఎన్టీఆర్ అందించిన ప్రోత్సాహమే దానికి కారణం అని ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు కూడా. ఇక శోభన్ బాబు ప్రతిభ ను చూసి చాలా వరకు ఎన్టీఆర్ ప్రోత్సహించే వారు అని ఎన్టీఆర్ ద్వారా శోభన్ బాబు పైకి వచ్చారు అని అంతే గాని వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని అంటారు. కాని మీడియా మాత్రం వీరి మీద ఎన్నో కథనాలు రాస్తూ ఉండేది అప్పట్లో.

మరింత సమాచారం తెలుసుకోండి: