క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి నాన్ బాహుబలి రికార్డుని కైవసం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకి ప్రతీ ఒక్కరూ ఫిదా అయ్యారు. సినిమాలో ఎక్కడా రామ్ చరణ్ కనిపించలేదు. రంగస్థలం ఊరిలోని చిట్టిబాబు మాత్రమే కనబడేలా చేశాడంటే నటుడిగా రామ్ చరణ్ ఎంత సక్సెస్ అయ్యాడో చెప్పవచ్చు.

 

సాధారణంగా హీరో అంటే ఎలాంటి లోపాలు లేకుండా ఉంటాడు. హీరోలు కూడా తమకేదైనా లోపాలు పెడతామంటే ఒప్పుకోరు కూడా. కానీ రామ్ చరణ్ ధైర్యం, సుకుమార్ టాలెంట్ రెండూ కలిసి రంగస్థలంలో హీరోని మరో లెవెల్ లోకి తీసుకెళ్ళాయి. కంటెంట్ సరిగ్గా ఉండి, హీరోకి లోపమున్నా కూడా ఎలివేట్ చేయచ్చని, అభిమానులకి గూస్ బంప్స్ కలగజేయచ్చని నిరూపించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకి కి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది.

 

ఇదిలా ఉంటే సినిమా వచ్చి రెండు సంవత్సరాలయినా కూడా ఇంకా రంగస్థలం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రంగస్థలం కన్నడలోనూ డబ్బింగ్ అయింది. తెలుగులో రిలీజ్ అయిన చాలా రోజులకి కన్నడలో డబ్ చేసి థియేట్రికల్ రిలీజ్ చేశారు. అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కన్నడ టెలివిజన్లోనూ మంచి ఇంప్రెషన్స్ దక్కించుకుంది.

 

మొన్నటికి మొన్న రంగస్థలం కన్నడ డబ్బింగ్ వెర్షన్ కి ౪౦లక్షలకి పైగా ఇంప్రెషన్స్ దక్కాయి. ఒక డబ్బింగ్ సినిమా.. అది కూడా రిలీజై చాలా రోజులు అవుతున్నా కూడా ఈ రేంజ్ లో ఇంప్రెషన్స్ రావడం చిన్న విషయం కాదు. అంటే ఈ సినిమాని అక్కడ ఎంతలా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రంగస్థలం ఒక్కటే కాదు, మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాకి కూడా టెలివిజన్లో ౪౦లక్షలకి పైచిలుకు ఇంప్రెషన్స్ వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: