లోకనాయకుడు కమల్ హాసన్ , స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కతున్నచిత్రం 'ఇండియన్ 2'.  ఇటీవల ఈ సినిమా షూటింగ్ సెట్ లో క్రేన్ ప్రమాదం జరగడం వల్ల ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ న్యూస్ సెన్సేషన్ సృష్టించింది. ఇక అప్పటినుండి సినిమా షూటింగ్  తాత్కాలింగా వాయిదాపడింది అయితే మరో సారి ఇప్పడు ఈ చిత్రం వార్తల్లో నిలిచింది.   
 
ఇండియన్ 2  నిడివి ఎక్కువగా ఉంటుందని దాంతో  ఈ చిత్రాన్ని రెండు పార్టులు గా విడుదలచేయనున్నారని వార్తలు వచ్చాయి ఇక దీనిపై స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అవన్నీరూమర్స్ అని ఇండియన్ 2 ఒకటే పార్ట్ గా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చింది అంతేకాదు లాక్ డౌన్ ముగిశాక మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపింది.   
 
సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈచిత్రంలో  కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా భవాని శంకర్ ,సిద్దార్థ్ , వెన్నల కిషోర్, విద్యుత్ జంవాళ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు  అలాగే వీరితోపాటు  ప్రముఖ  బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈసినిమాలో ముఖ్య  పాత్రలో నటిస్తున్నాడు.  భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి  యంగ్ మ్యూజిక్  సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. 1996లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ ఇండియన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం తమిళం తో పాటు తెలుగు ,హిందీ భాషల్లో విడుదలకానుంది.  ఇక ఈ సినిమా తరువాత కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజీయాల్లో బిజీ కానున్నాడు. ఇప్పటికే  కమల్ పార్టీని కూడా  స్థాపించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: