తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య మంచి స్నేహ పూర్వక బంధం ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక కొంతమంది స్టార్ హీరోల మధ్య అయితే ఈ బంధం కాస్త మరింత బలంగా ఉంటుంది. ఇక ఒకరిని ఒకరు ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. ఇలా ఆప్యాయంగా పిలుచుకునే స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ కూడా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య  ఒక అపురూపమైన స్నేహబంధం కొనసాగుతోంది. వీరిద్దరూ ఎప్పుడు టచ్ లో ఉండటమే కాదు ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు కూడా. 

 

 ఇక వీరిద్దరి స్నేహ బంధం అంటే అటు ప్రేక్షకులు కూడా మురిసిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఒకరిని ఒకరు బావ అని ప్రేమగా పిల్చుకుంటుంటారు. ఇక ఒకరి సినిమాలకు ఒక్కరు సపోర్ట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటారు. ఇలా వీరిద్దరి మధ్య స్నేహబంధం ఎంతో అపురూపంగా కొనసాగుతూ వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డాన్సర్లు కూడా విరిద్దరే. అల్లు అర్జున్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులు ఆకర్షిస్తే జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో విశ్వరూపం చూపిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. 

 

 ఇక వీరిద్దరూ ఎక్కడైనా తెరమీద కనిపించారు అంటే అక్కడ సరదాగా మాట్లాడు కోవడం.. ఆప్యాయంగా పలకరించుకోవటం.. వీరి మధ్య  స్నేహబంధం అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండు అని అటు ప్రేక్షకులు కూడా ఆశతోనే ఉన్నారు. ఇప్పటికైతే రామ్ చరణ్ ఎన్టీఆర్ తో సినిమా ఓకే అయ్యింది . మరి అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమాకు ముహూర్తం ఎప్పుడు ఉంటుందో అన్నది మాత్రం ఎవరికి తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: