సమాజంలో స్త్రీ ఎదుర్కోనే సమస్యలకు అంతు ఉండటం లేదు. సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చాలా సినిమాలు వచ్చాయి. సమస్యలను ఎదుర్కొనటం, పోరాడటం, మహిళలు సాధించిన విజయాలపై కూడా చాలా సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. ఇలాంటి కోవలోను తెలుగులో వచ్చిన అద్భుత సినిమాలలో ఒకటి చిరంజీవిరాధిక ప్రధానపాత్రల్లో వచ్చిన ‘న్యాయం కావాలి’ సినిమా. స్త్రీ తలచుకుంటే ఎంతటి విజయాన్నైనా సాధిస్తుంది, పురుషుడి కంటే స్త్రీ ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించిన ఈ సినిమా విడుదలై 39 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

హీరో కమ్ విలన్ గా చిరంజీవి నటించిన ఈ సినిమా 1981 మే 15న విడుదలైంది. అమ్మాయిని ఆట వస్తువుగా భావించి ప్రేమ ముసుగులో ఆమెను మోసం చేసి వదిలేసే పాత్రలో చిరంజీవి నటించారు. ప్రియుడి మోసానికి బలై సమాజంలోని కట్టుబాట్లకు ఎదురొడ్డి అతనిపై చేసిన న్యాయ పోరాటంలో గెలిచిన స్త్రీ పాత్రలో రాధిక నటించింది. ప్రేమిస్తున్నానంటూ వెంటబడే యువకుల్ని నమ్మకూడదని చెప్తూ.. స్త్రీ తలచుకుంటే ఏదైనా సాధిస్తుందని చెప్తూ ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకులు కోదండరామి రెడ్డి. ఈ సినిమాలో చిరంజీవిరాధిక పోటాపోటీగా నటించారు. వారి పాత్రలు కూడా అంత శక్తివంతంగా రాసుకున్నారు. సమాజంలోని సమస్యపై తెరకెక్కిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.

IHG

 

శ్రీ క్రాంతి చిత్ర బ్యానర్ పై నిర్మాత క్రాంతి కుమార్సినిమా నిర్మించారు. చిరంజీవి – కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్స్ లో ఈ సినిమా కూడా ఒకటి. 6 సెంటర్లలో 100 రోజులు ఆడిన ఈ సినిమా విజయవాడ, హైదరాబాద్ లలో 200 రోజులు ఆడింది. చక్రవర్తి సంగీతంలోని పాటలన్నీ మ్యూజికల్ హిట్టయ్యాయి. కమర్షియల్ గా విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది ఈ సినిమా.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: