తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది హీరో హీరోయిన్ ల  మధ్య మంచి స్నేహ బంధం కొనసాగుతూ ఉంటుంది. ఇక హీరో హీరోయిన్ల మధ్య స్నేహబంధం ఉంటే కాస్త క్లోజ్ గా  ప్రేక్షకులకు కనిపించారు అంటే...  వారి మధ్య ప్రేమ ఉంది అని డిసైడ్ చేస్తూ  ఉంటారు. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి వారసుడిగా తనదైన నటనతో ఎంతో క్రేజ్ సంపాదించి ఓ వైపు హీరోగా మరో వైపు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు రానా.  అయితే రానాకు ఒకప్పుడు త్రిష తో మంచి స్నేహ బంధం ఉన్న విషయం తెలిసిందే. 

 

 హీరోయిన్ త్రిషతో మధ్య స్నేహబంధాన్ని కొనసాగించిన రానా  ఎన్నో ఏళ్ల పాటు ఇద్దరు కలిసి తిరిగారు. ఇక రెండు మూడు సంవత్సరాల పాటు వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే వచ్చాయి . అయితే ఆ తర్వాత వీరిద్దరి కి సంబంధించిన ఏ అప్డేట్ కూడా మీడియాకు దొరకలేదు. దీంతో వీరిద్దరూ ఇన్ని రోజులు ప్రేమలో ఉన్నారని సడన్  గా బ్రేక్ అప్ విడిపోయారు అంటూ సరికొత్త టాక్ వినిపించడం మొదలయింది.

 

 తమ మధ్య మంచి స్నేహ పూర్వక బంధం ఉంది అని ఇద్దరు క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది అనుకున్నారు. ఇక మొన్నటికిమొన్న త్రిష బర్త్ డే సందర్భంగా రానా త్రిషకు స్పెషల్ విషెస్ చెప్పాడు. నా పాత స్నేహితురాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటు  రానా ఒక స్పెషల్ విషెస్ చెప్పడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. కాగా వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహ బంధమా ప్రేమ బంధమా అన్నది మాత్రం ప్రేక్షకులు ఇప్పటికీ ఒక కన్ఫ్యూషనే .

మరింత సమాచారం తెలుసుకోండి: