హాట్ యాంక‌ర్ అన‌సూయ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క ర్లేదు. సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు యాక్టివ్ గా ఉండే అన‌సూయ త‌న అభిమానులు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఎంతో ఓపిక‌గా ఆన్స‌ర్ ఇస్తూ ఉంటుంది. తాజాగా అన‌సూయ కు కోపం క‌ట్టలు తెంచుకుంది. ఆమె నువ్వు ఎవ‌డివిరా నా డ్రెస్ పై కామెంట్ చేయ‌డానికి అంటూ తెగ చిర్రు బుర్రు లాడేసింది. ఇంత‌కు ఏం జ‌రిగిందంటే నిన్న  ఈ హాట్ యాంక‌ర్ పుట్టిన రోజు . ఈ క్ర‌మంలోనే అన‌సూయ కొన్ని మంచి ప‌నులు చేసింది. లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతోన్న నేప‌థ్యంలో ఆమె హైద‌రాబాద్ స‌మీపంలో ఉన్న కీస‌ర ప్రాంతంలో వందమంది గర్భిణీ స్త్రీలకూ న్యూట్రీషన్ కిట్స్ అందించింది.

 

ఆ త‌ర్వాత ఆమె త‌న అభిమానుల‌ను అల‌రించేందు కు ఫేస్ బుక్ లైవ్ లోకి వ‌చ్చింది. ఫేస్ బుక్ లో ఆమెను ప‌లువురు ప‌లు ప్ర‌శ్న‌లు వేయ‌డంతో పాటు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. అయితే కొంద‌రు మాత్రం ఆమె లైవ్ కింద బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఆమెను వేధించాల‌ని ట్రై చేశారు. ఈ క్ర‌మంలోనే ఓ వ్య‌క్తి ఆమె డ్రెస్ గురించి అసభ్యంగా కామెంట్ చేశాడు. తాజా లైవ్ లో అనసూయ డిజైనర్ వేర్ డ్రెస్ లో కనిపించింది. ఇక లైవ్ లో మాట్లాడుతున్న సమయంలో కొంద‌రు నెటిజ‌న్లు ఆమె డ్రెస్ గురించి కామెంట్ చేశారు.

 

నువ్వు ఏంటి నీ డ్రెస్ ఏంటి ?  నువ్వు ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లివి... కాస్త ప‌ద్ధ‌తిగా ఉండాలి క‌దా ? అని కామెంట్ చేశాడు. దీంతో అన‌సూయ కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. నువ్వు ఎవ‌డ్రా నా డ్రెస్ గురించి మాట్లాడ డానికి.. అమ్మ అయితే ఆ డ్రెస్ వేసుకోవాలి... ఈ డ్రెస్ వేసుకోకూడ‌దు అన్న రూల్ ఏమైనా ఉందా ? అని ప్ర‌శ్నించింది. అస‌లు అమ్మ త‌నం గురించి మాట్లాడే అర్హ‌త నీకు ఉందా ? అంటూ మండి ప‌డింది. నా పుట్టిన రోజున నాతో తిట్లు తినాలనుకున్నావా అంది. అమ్మ ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వు ఎవడివిరా అని ఓ రేంజ్‌లో ఆడేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: