తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు ఉన్నా  నాగ్ అశ్విన్ కి మాత్రం ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంటుంది. ఎప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి విజయాలు అందుకుంటూ ఉంటారు నాగ్ అశ్విన్. ఇక ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో వచ్చిన మహానటి సినిమా అయితే తెలుగు ప్రేక్షకులకు ఈ దర్శకుడుని  మరింత దగ్గర చేసింది అని చెప్పాలి. దర్శకుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించారు మహానటి సినిమా తో నాగ్ అశ్విన్. ఇక ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రభాస్ తో సినిమా చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. 

 

 ఇకపోతే తాజాగా నాగ్ అశ్విన్ థియేటర్లకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు... తాను ఒకసారి నిర్మాత సురేష్ బాబు హీరో రానా  విషయాన్ని వారితో అడిగానని... ఇతర దేశాలలో లాగా థియేటర్లలో బీజర్,  బీర్,  వైన్ అమ్మడానికి లైసెన్స్ లభిస్తే... అది ఏమైనా పుట్ పాల్స్ ని  పెంచుతుందా... వ్యాపారాన్ని ఆదా చేయగలదా... మీరు ఏమనుకుంటున్నారు.. ఇది మంచి ఆలోచన లేక చెడ్డ  ఆలోచన అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్  పెట్టిన ట్విట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 

 

 అయితే అలా చేస్తే ఏం జరుగుతుంది అంటే... థియేటర్లకు కుటుంబ ప్రేక్షకులందరినీ ఎంతగానో దూరంగా ఉంచుతుంది... కొన్ని మల్టీప్లెక్స్ లలో ఇలా చేయడం సరైనది కావచ్చు కానీ... ప్రస్తుతం ఇది పరిష్కారం కాదు. పి పి ఎల్ ను తిరిగి పొందడానికి థియేటర్లు అన్ని  పునర్వైభవాన్ని  రావాల్సిన అవసరం ఉందా... ఒక వేళ ప్రేక్షకులను పెంచడానికి థియేటర్లను తెరిచిన వెంటనే మీరు తిరిగి వస్తారా లేదా వెళ్లే ముందు కొన్ని వారాలు వేచి ఉండి చూస్తారా అంటూ ప్రేక్షకులందరినీ ప్రశ్నిస్తూ తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్  ఒ ట్విట్  పెట్టారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: