తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన  డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులందరికీ ఎనర్జిటిక్ స్టార్ గా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రామ్. అయితే మొన్నటి వరకు వరుస ప్లాప్ సినిమాలతో సతమతమైన రామ్  పూరి జగన్నాద్  చేతిలో పడటంతో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో మళ్లీ ట్రాక్ లొకి వచ్చిన విషయం తెలిసింది. ఇష్మార్ట్శంకర్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. 

 


 ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ లుక్ తో అదరగొట్టి  తెలంగాణ యాస తో ఇరగదీసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సారి అలాంటి మాస్ లుక్ తోనే రెడ్ అనే సినిమాలో నటిస్తున్నడు రామ్ . కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో  రోజురోజుకూ అంచనాలను పెంచేస్తుంది. మరోసారి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఖాతాలో  ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్బస్టర్ హిట్ చేరడం ఖాయం అని అనుకుంటున్నారు అభిమానులు. సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏం వచ్చిన  క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. 

 

 అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక మాస్ పాట విడుదలైన విషయం తెలిసిందే. దించక్ అంటూ ఓ మాస్ పాట విడుదలవ్వగా ఈ పాటలో  రామ్ మాస్ లుక్తో ఇరగదీశాడు. కాగా ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తుంది. అయితే ఈ పాట విడుదలైన రెండు రోజుల వ్యవధిలోనే ఈ పాటకు లక్షల లైకులు వచ్చాయి. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాత బి.ఎ.రాజు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.మాస్ శాంతి మాసివ్ రెస్పాన్స్ వచ్చింది అంటూ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: