బ్రెయిన్ ఉంటే సరిపోదు.. దానికి కొంచెం పనిపెట్టాలి. కొత్తకొత్తగా ఆలోచించాలి. కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలి. అపుడే గుర్తింపు. ఆ గుర్తింపు ఏ స్థాయిలో అయినా రావొచ్చు. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనైనా ఉండొచ్చు. కొత్తగా ఆలోచించి.. ఆ ఆలోచనలకు రూపం ఇచ్చే వారిపై ఎపుడూ ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంటుంది. అంతేకాదు ముఖ్య వేదికలపై పురస్కారాలూ అందుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మనసానమ: అనే షార్ట్ ఫిల్మ్ కూడా ఇలాగే ఇంటర్నేషనల్ ప్లాట్ ఫార్మ్ పై తెలుగు వాళ్ల సత్తా ఏంటో చూపించింది. ఏకంగా హాలీవుడ్ పురస్కారాన్ని కైవసం చేసుకొని ఔరా అనిపించింది.

 

మనసానమ:  షార్ట్ ఫిల్మ్ సాధారణ లవ్ స్టోరీనే. కానీ ప్రేమలో చాలా ఎమోషన్స్ ఉన్నట్టు, ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ లోనూ చాలా ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. ప్రజంటేషన్ కొత్తగా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా రివర్స్ షాట్స్ లో ప్రేమ కథలు చెప్పడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ జేజెమ్మ అనుష్క కూడా ఈ లవ్ స్టోరీ మేకింగ్ కు ఇంప్రెస్ అయింది. వర్త్ వాచ్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చింది అనుష్క. అంతేకాదు పలువురు ప్రముఖుల నుంచి ఆ షార్ట్ ఫిల్మ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

 

మనసానమ:  షార్ట్ ఫిల్మ్ ఎవరూ ఊహించని విధంగా కొత్తగా రూపుదిద్దుకుంది. ఓ కుర్రాడి లైఫ్ లో ఉన్న మూడు ప్రేమకథలను ఎంతో వినూత్నంగా చూపించాడు దర్శకుడు దీపక్. అదీ రీవైండ్ లో ప్రదర్శించి ప్రేక్షకుల నుంచి మన్ననలు అందుకుంటున్నాడు. పైగా ఈ రివర్స్ షాట్స్ ను సింగిల్ షాట్ లో రూపొందించడం విశేషం. ఈ ఎక్స్ పెరిమెంట్స్ కే మనసానమ: షార్ట్ ఫిల్మ్ అంతర్జాతీయ వేదికపై పురస్కారం అందుకుంది.  

లాస్ ఏంజెల్స్ లోని రాలీ స్టూడియో నిర్వహించిన ఇండిపెండెంట్ షార్ట్ అవార్డ్స్ లో రొమాంటిక్ కేటగిరీలో ప్లాటినమ్ అవార్డ్ అందుకుంది మనసానమ:. ప్రపంచ దేశాలన్నింటి నుంచి నాలుగు వేలకు పైగా షార్ట్ ఫిల్మ్స్ పోటీ పడిన ఈ కాంపిటీషన్ లో పురస్కారం అందుకుంది.  ఇక ఈ పురస్కారం ఇచ్చిన ప్రోత్సాహంతో ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు దీపక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: