IHG

ఇండియన్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్. తన కెరీర్ ఆరంభం లో కన్నుగీటి సైగ చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. 2017 లో వచ్చిన  ఓరు ఆధార్ లవ్ సినిమాలో కన్నుగీటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈమెకు ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ తో అప్పట్లో తన ఇన్స్టాగ్రామ్ ద్వారా 10 మిల్లియన్ ఫాల్లోవర్స్ ని పొందింది. ఇది  కొన్నేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పది లక్షల మంది ఫాలోవర్లను చేరుకున్న భారతీయ ప్రముఖులలో ఆమె ఒకరు గా మారింది. ఈమెకు వచ్చిన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని కొందరు సినీ ప్రముఖులు క్యాష్ చేసుకున్నారు కూడా. తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్ నుండి వైతొలగింది. దీనికి కారణం మటుకు ఈ నటి వివరించలేదు.

 

పెరుగుతున్న ఆన్‌లైన్ దుర్వినియోగం మరియు ట్రోల్‌ల కారణంగా నటి ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఆమె సన్నిహితులు మాత్రం ఈ తొలగింపు తాత్కాలికమే అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా 1.7  మిల్లియన్ ఫాలోవర్స్ ని పొంది ఉంది. వీరంతా కూడా ఈ హఠాత్ పరిణామం కారణంగా షాక్ లో ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ ఈమె ఇతర సోషల్ మీడియా ఖాతాలైన పేస్ బుక్ , టిక్ టాక్ లు యాక్టివ్ గానే ఉన్నాయ్. ప్రస్తుతం ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహిస్తున్న శ్రీదేవి బంగ్లా చిత్రం లో నటిస్తుంది. ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్ కూడా నటించారు. శ్రీదేవి భర్త బోణి కపూర్ ఈ సినిమాను ఆపవలసిందిగా కోర్ట్ ని కోరడంతో ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడింది. 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: