వెబ్ సిరీస్..ఇపుడు అందరి నోటా ఇదే మాట. కరోనా లేకపోయినా లాక్ డౌన్ రాకపోయినా కూడా పెద్ద తెరనే మరీ భారీ ఎత్తున  పెద్దగా చూపించేవారు. సినిమాహాళ్ళను గుత్తకు తీసుకున్న వారు వినోదంతో ఇప్పటిదాకా  భలే వ్యాపారం చేస్తూ వచ్చారు. ఇపుడు మాత్రం కచ్చితంగా వెబ్ సీరీస్ వైపు మళ్లుతున్నారు. అది వారి అవసరం. వ్యాపారం సాగాలంటే తప్పదు మరి.

 

అయితే వెబ్ సిరీస్ మీద తెలుగు వారు చూపిస్తున్న శ్రధ్ధ కంటెంట్ మీద లేదని విమర్శలు వస్తున్నాయి. కంటెంట్ బాగుంటేనే వెబ్ సీరీస్ లో మజా ఉండేది. దాన్ని నెటిజన్లు చూసేది. మంచి కంటెంట్ కోసమే నెటిజన్లు వెబ్ వైపు చూస్తారు. కానీ ఇప్పటిదాకా చూస్తే తెలుగు మేకర్స్ వెబ్ సిరీస్ లో అంతా బీ గ్రేడ్ కంటెంట్ తోనే సరిపెడుతున్నారని అంటున్నారు.

 

ఈ విధంగా చేయడం వల్ల వెబ్ మీడియాని హిట్  ప్లేస్ ని  కాప్చర్ చేయడం కష్టమని అంటున్నారు. అదే హిందీ, ఇంగ్లీష్ వెబ్ సీరీస్ ని చూస్తే న్యూ కంటెంట్ ఉంటోంది. ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ ని టచ్ చేస్తున్నారు. దాంతో ఆదరణ అదిరిపోతోంది. ఈ విషయంలో మాత్రం వారికి హాట్సాఫ్ చెప్పాల్సిందే. 

 

దాంతో మన తెలుగు వారు కూడా ఆ వెబ్ సిరీస్ చూసేందుకే అలవాటు పడ్డారు. అలా ఉన్న వారిని తెలుగు వైపు తీసుకురావడం అంటే కష్టమేనని అంటున్నారు. కంటెంట్ ప్రధానంగా వెబ్ సిరీస్ ఉంటాయి. మన సినిమాలు హీరో బేస్డ్ గా ఉంటాయి. అందువల్ల కంటెంట్ కి పెద్ద పీట వేయడం నేర్చుకుంటేనే తెలుగులో వెబ్ సిరీస్ సక్సెస్ అవుతాయి అంటున్నారు.

 

మరి ఆ దిశగా భారీ ప్రయత్నం జరగాలి. మేధస్సుని ఉపయోగించాలి. చూస్తే సమాజంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిని మలచుకుంటే తెలుగు వెబ్ సిరీస్ కూడా టాప్ కావచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: