ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వైరస్ గురించిన చర్చలే నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ వైరస్ కూడా ఇంతదారుణమైన ప్రభావం చూపించలేదు. మనుషుల మద్య దూరాన్ని పెంచింది.. ఆర్థిక, వాణిజ్య వ్యవస్థపై ప్రభావం చూపించింది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు... లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి.  ఒక్క కరోనా వల్ల అమెరికాలో ఇప్పటి  అమెరికాలో ఎక్కువగా 86,912 మంది చనిపోయారు. 14,57,593 మంది కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత బ్రిటన్​లో 33,614 మంది చనిపోగా, ఇటలీలో 31,368 మంది బలయ్యారు.  మరణాలు ఎక్కువగా అమెరికా, బ్రిటన్​, ఇటలీ, స్పెయిన్​, ఫ్రాన్స్​, బ్రెజిల్​లోనే చనిపోయారు. ఈ ఆరు దేశాల్లోనే 2,18,923 మంది చనిపోయారు. మొత్తం మరణాల్లో ఆయా దేశాల వాటానే 72.7 శాతం అంటే అక్కడ పరిస్థితి ఎంత సీరియస్​గా ఉందో అర్థం చేసుకోవచ్చు.   

 

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో అక్కడ తెలుగువారు ఎలా ఉన్నారనే దానిపై ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ఆరా తీశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నాయకులకు ఫోన్ చేసి అమెరికాలో ఉంటున్న తెలుగువారు యోగక్షేమాలు కనుక్కున్నారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్, న్యూయార్క్‌లో ప్రముఖ వైద్యులు నాట్స్ మాజీ చైర్మన్ మధు కొర్రపాటికి ఫోన్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కనుక్కున్నారు. ముఖ్యంగా తెలుగువారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది అడిగి తెలుసుకున్నారు. తెలుగువారంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. తెలుగు సంఘాలు వారిని ఎప్పటికప్పుడూ కరోనా కట్టడి పై చైతన్యపరచాలని కోరారు.

 

ఇండియా సమయం ప్రకారం శుక్రవారం తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఈ కాల్ చేసినట్టు నాట్స్ నాయకులు తెలిపారు. కరోనా కష్టకాలంలో తెలుగువారికి అండగా నిలవాలని కోరినట్టు చెప్పారు. అమెరికాలో తెలుగువారిని అప్రమత్తం చేస్తూ నాట్స్ కార్యక్రమాల చేస్తుందని.. తెలుగునాట కూడా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తుందని ఈ సందర్భంగా డా. మధు కొర్రపాటి బాలకృష్ణకు వివరించారు. తెలుగువారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనేదే తన అభిమతమని బాలకృష్ణ అన్నట్టు మధు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: