రణబీర్ కపూర్ తో బ్రేకప్ అయిన తర్వాత బాగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయిన దీపికా పదుకొణె అదృష్టవశాత్తు ఎటువంటి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించలేదు కానీ ఎన్నో రోజుల వరకు అన్నపానీయాలు లేకుండా తన జీవితాన్ని గడిపింది. 2013వ సంవత్సరంలో రణవీర్ సింగ్ ఆమె జీవితంలోకి వచ్చి స్వచ్ఛమైన ప్రేమ ఆప్యాయతలు చూపించి తనని మళ్ళీ సాధారణమైన మనిషిగా తయారుచేశాడు. అందుకే అతన్ని ఆమె పెళ్లాడింది. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న వేళా ఇంటికే పరిమితమైన దీపికా పదుకొణె తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి చాలా హ్యాపీ గా తన జీవితాన్ని గడుపుతుంది. అలాగే తనకు సంబంధించిన చిన్ననాటి ఫోటో లను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది.


తాజాగా 2000 సంవత్సరంలో ఆమీర్ ఖాన్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది. అలాగే ఆ ఫోటో గురించి కాస్త సమాచారం తెలిపింది. జనవరి 1వ తేదీన 2006 సంవత్సరంలో ఈ ఫోటో తీయబడింది. అప్పుడు నాకు 13 సంవత్సరాలు. ఆ సమయంలో నేను అందరినీ ఇబ్బంది పెడుతూ అల్లరి పిల్లగా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న. ఇప్పటికీ నేను అందర్నీ ఇబ్బంది పెడతాననుకోండి అని పేర్కొంటూ జనవరి 1వ తేదీన తన ఇంటికి విచ్చేసిన ఆమీర్ ఖాన్ పెరుగన్నం తింటున్నాడని... ఎప్పటిలాగానే అప్పుడు కూడా తనకు బాగా ఆకలి వేస్తుందని... కానీ అతడు తనకు ఒక ముద్ద కూడా పెట్టలేదని... అడగాలనుకున్న కానీ మొహమాటంతో అడగలేదని ఆమె చెప్పుకొచ్చింది.


పైన కనిపిస్తున్న ఫోటోలో దీపిక తండ్రి ప్రకాష్ పదుకొణె, తల్లి ఉజ్జల పదుకొణె, సోదరి అనీషా ఉన్నారు. ఇకపోతే దీపికా పదుకొణె కబీర్ ఖాన్ '83 సినిమాలో కనిపించనుండగా... ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలో సరికొత్త అవతారం లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: