సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన మైనే ప్యార్ కియా(1989) సినిమాలో హీరోయిన్ గా నటించి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన భాగ్యశ్రీ తదనంతరం తమిళ, కన్నడ, తెలుగు, భోజపురి సినిమాల్లో నటించి కోట్ల మంది అభిమానులను సంపాదించింది. ఈ సంవత్సరం భాగ్యశ్రీ కంగనా రనౌత్ యొక్క తలైవి, ప్రభాస్ యొక్క ప్రభాస్ 20 సినిమాల్లో కనిపించనున్నది. తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల వెబ్సైట్ తో ముచ్చటించిన భాగ్యశ్రీ తన ఫిలిం కెరీర్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించింది. భాగ్యశ్రీ ఇంటర్వ్యూ కింది విధంగా కొనసాగింది.


చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు కదా?! మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?


"నేను ఫిలిం ఇండస్ట్రీ లో అడపాదడపా పనులు చేస్తూనే ఉన్నాను. ఫిలిం ఇండస్ట్రీ నుండి ఎన్నడూ దూరమైన రోజులు లేవు. కొన్నాళ్లపాటు బుల్లితెరపై కనిపించాను, ఆ తర్వాత వెబ్ సిరీస్ లో కొంతకాలం నటించాను. కానీ వెండితెరపై నన్ను నేను చూసుకుని చాలా రోజులు అవుతుంది. నేను ఆఖరిసారిగా నటించిన చిత్రం రెడ్ అలర్ట్: థ వార్ విత్ ఇన్ విడుదలయ్యి 10 సంవత్సరాలు కావస్తోంది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తలైవి తో పాటు krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ప్రభాస్ 20లో నటిస్తున్నాను. ఈ రెండు చిత్రాల దర్శకులు ఫ్రెష్ క్యారెక్టర్ కావాలనే ఉద్దేశంతో నన్ను ఎంపిక చేసుకున్నారు. నేను చేయబోయే రెండు పాత్రలు పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. ఈ రెండు పెద్ద చిత్రాలలో నాకు ఒకే సారి అవకాశాలు రావడం అనేది నా అదృష్టంగా భావిస్తాను' అని ఆమె చెప్పుకొచ్చారు.


పీరియడ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రభాస్ 20, తలైవి సినిమాల్లో మీ వర్క్ ఎలా ఉందో చెప్తారా?


"తలైవి చిత్రం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర. నా పాత్రకు సంబంధించిన సన్నివేశాలు 1980-90 ని తలపించే రీతిలో సెట్స్ ఉంటాయి. ఈ చిత్రంలో నా పాత్ర కల్పితమైన అది కాదు. ఒక నిజమైన వ్యక్తి క్యారెక్టర్లో నేను నటిస్తున్నాను. ఆ నిజమైన వ్యక్తి లాగా కనిపించేందుకు నేను కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రభాస్ 20 సినిమా గురించి చెప్పాలంటే... అది యూరోప్ లో చోటుచేసుకునే 1970 కాలం నాటి రొమాంటిక్ పిరియాడిక్ డ్రామా. ఈ చిత్రంలో నా క్యారెక్టర్, లుక్, సెట్స్ అన్ని అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా చూపించడం జరుగుతుంది. ఈ మూవీ నిర్మాతలయిన విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఎన్నో కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీగా లెవెల్ లో ప్రభాస్ 20ని తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ అయిన మనోజ్ పరమహంస అద్భుతమైన షాట్లను తీశాడు. అందుకుగాను అతనికి నేను ప్రత్యేక క్రెడిట్స్ ఇస్తున్నాను" అని ఆమె తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: