IHG

పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులు విజిల్స్ తో సినిమా హాల్ ని హోరెత్తిస్తారు. పవన్ రాజకీయాల్లో ఉన్నా సినిమా ఇండస్ట్రీ లో ఉన్నా అయన క్రేజ్ ఏమాత్రం తగ్గదంటే అతిశయోక్తి కాదేమో. పవన్ అజ్ఞాతవాసి సినిమా తరువాత పూర్తిగా రాజకీయాల వైపు దృష్టిపెట్టినప్పుడు అభిమానులు పవన్ ఒక్క సినిమా అయినా తీయక పోతాడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. ఒకానొక టైం లో పవన్ ఇక సినిమాలలో నటించడు అన్న వార్త అభిమానులను కలవర పరచింది. పవన్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తన నటనను మొదలు పెట్టి అజ్ఞాత వాసి వరకు కొన్ని కోట్ల అభిమాన జనాన్ని పోగుచేశాడంటే అతిశయోక్తి కాదేమో.

 

IHG

పవన్  ఎంత యావరేజ్ సినిమా తీసినప్పటికి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రం తారాస్థాయిలో వాసులు చేస్తుంది. అది పవన్ కళ్యాణ్ యొక్క స్టామినాను గుర్తు చేస్తుంది. పవన్ డైలాగ్ డెలివరీ ఓ సాధారణ ఆడియాన్ కి కూడా మంచి హుషారు పుట్టిస్తుంది. ప్రస్తుతం పవన్ సుదీర్ఘ సినీ విరామం తరువాత రాజకీయాలకు తాత్కాలిక విరామం ఇస్తూ బాలీవుడ్ లో గొప్ప ఆదరణ పొందిన అమితాబచ్చన్ నటించిన పింక్ సినిమాను పవన్ తెలుగులో వకీల్ సాబ్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వం లో ఓ హిస్టారికల్ మూవీని చేస్తున్నాడు. మరి ఇందులో భూమిక తో పవన్ మరోసారి జోడి కడుతున్నట్లు సమాచారం. ఇదే వార్త నిజం అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఇంతకంటే పండగలాంటి వార్త మరొకటి ఉండదు. 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: