తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద అల్లు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. స్టార్ ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్, హీరోలుగా అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఆ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. వీరిలో అల్లు అర్జున్ సౌత్ ఇండియాలో ఉన్న టాప్ హీరోల్లో ఒకడిగా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నాడు. బన్నీతో పాటు ఆయన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హ కూడా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ప్రస్తుతం బన్నీ పిల్లలు డ్యాన్స్ చేస్తున్న వీడియో మరొకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

 

 

రీసెంట్ గా అల్లు అయాన్ సలాడ్ రెసిపీ చేస్తూ పోస్ట్ చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు బాబాయ్ అల్లు శిరీష్ తో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇంగ్లీష్ పాటకు లయబద్దంగా అయాన్, అర్హ ఇస్తున్న డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ముద్దు ముద్దుగా వీరిద్దరూ వేస్తున్న స్టెప్స్ అలరిస్తున్నాయి. వీరికి తోడు అల్లు శిరీష్ కూడా తనదైన స్టైల్లో స్టెప్స్ వేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో బన్నీ పిల్లలిద్దరూ తమ బాబాయ్ శిరీష్ తో కలిసి సందడి చేస్తున్నారు.

 

 

అర్హ కూడా రీసెంట్ గా ముద్దు ముద్దు మాటలతో చేసిన వీడియో వైరల్ అయింది. పిల్లలు చేసిన సందడిని స్నేహ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియోకు బన్నీ ఫ్యాన్స్, నెటిజన్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ వీడియోకు శిరీష్ కూడా రెస్పాండ్ అయ్యాడు. ‘ఈ 2020లో నాకు ఇదొక డ్యూటీ. ఇందులో పిల్లలను ఆడించడం కూడా ఒకటి’ అని పోస్ట్ చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Fun with siri Babai ❤️

A post shared by allu sneha Reddy (@allusnehareddy) on

మరింత సమాచారం తెలుసుకోండి: