చూసేందుకు ఎర్రగా బుర్రగా ఉంటుంది. గ్లామర్ తో మాయ చేయగల సత్తా ఉంది. అయినా.. గుర్తింపు మాత్రం దక్కలేదు. ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్లు దాటినా.. ఈ అమ్మడిని ఇప్పటికే ఐటం గాళ్ గానే చూస్తున్నారు. దీని నుంచి బయటపడటానికి.. నటి అని నిరూపించుకోవడానికి ఏకంగా మూడు పాత్రల్లో కనిపిస్తోంది. 

 

హీరోయిన్ గా నటించినా.. సక్సెస్ దక్కలేదు. తెలుగు, తమిళంలో లాభం లేదని.. హిందీలో అదృష్టం పరీక్షించుకుంటే.. అక్కడా నిరాశే మిగిలింది. ఐటం గాళ్ గా గుర్తింపు తెచ్చుకున్నా.. అవీ ఒకటీ అర ఛాన్సులే. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీరాయ్ నయనతారను ఫాలో అవుతూ.. హారర్ థ్రిల్లర్స్ చేస్తోంది. 

 

లక్ష్మీరాయ్ కు మాంచి గ్లామర్ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ తో స్టార్స్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ.. లక్ష్మీరాయ్ కు మాత్రం స్టార్ డమ్ దక్కలేదు. తెలుగు, తమిళంలో నటించినా.. ఆ ప్రత్యేక హోదా రాకపోవడంతో.. జూలీ 2 అనే హిందీ మూవీతో బాలీవుడ్ లో భారీ అందాలు ఆరబోసింది. అయినా ఫలితం మాత్రం మారలేదు. 

 

తెలుగులో అడపాదడపా ప్రత్యేక గీతంలో మెరిసే రత్తాలు ప్రస్తుతం సిండ్రెల్లా అనే తమిళ హారర్ థ్రిల్లర్ లో నటిస్తోంది. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ట్రిపుల్ రోల్ లో కనిపించనుంది లక్ష్మీరాయ్. సిండ్రెల్లాగా టైటిల్ రోల్ తో పాటు.. రాక్ స్టార్ గా కనిపించనుంది. మరోవైపు దెయ్యంగా భయపడుతోంది. 

 

హారర్.. థ్రిల్లర్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నయనతార దారిలో లక్ష్మీరాయ్ నడుస్తోంది. హారర్.. నేపథ్యమున్న కథలను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్ సాగిస్తోంది లక్ష్మీరాయ్. ఇదే బ్యాక్ డ్రాప్ లో నటించిన వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి.. నియా 2 సినిమాలు ఫ్లాప్ అయినా.. మరోసారి భయపెట్టే కథనే నమ్ముకుంటూ.. సిండ్రిల్లాగా అదృష్టం పరీక్షించుకుంటోంది లక్ష్మీరాయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: