కొంత కొంత మంది సినిమాల విషయంలో ముందు నుంచి కూడా ఒక ఆసక్తి అనేది ఉంటుంది. దర్శకుడు అయినా హీరో అయినా సరే వారి సినిమా గురించి ప్రత్యేకంగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. అది ఏ భాషలో వచ్చే సినిమా అయినా సరే. ఇప్పుడు మన తెలుగులో ఎక్కువగా చర్చలు జరిగే దర్శకుల్లో సుకుమార్ ముందు ఉంటారు. సుకుమార్ సినిమా వస్తుంది అంటే చాలు ప్రేఖకులకు పండగే. ప్ర‌స్తుతం ఉన్న జ‌న‌రేష‌న్ ద‌ర్శ‌కుల్లో సుకుమార్ క్రియేటివి.. ఆయ‌న శైలే వేరు. సినిమా సినిమాకు సుకుమార్ ఎలాంటి వైవిధ్యం చూపిస్తాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 

 

వ‌న్ నేనొక్క‌డినే, నాన్న‌కు ప్రేమ‌తో, రంగ‌స్థ‌లం లాంటి వైవిధ్య‌మైన సినిమాల‌తో సుకుమార్ త‌న‌కంటూ స‌ప‌రేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రంగ‌స్థ‌లం త‌ర్వాత సుకుమార్ క్రేజ్ ఎక్క‌డికో వెళ్లి పోయింది. సుక్కు సినిమా అంటే ముందు హీరో పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే దాని మీదనే చర్చలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సుక్కు - బ‌న్నీ కాంబోలో వ‌స్తోన్న పుష్ప‌ సినిమా విషయంలో ఒక చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఈ సినిమాలో సుకుమార్ కూడా నటించే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో సుకుమార్ బన్నీ కి తండ్రి గా నటించే అవకాశం ఉందని సమాచారం. 

 

సుకుమార్ ఈ సినిమాలో నటించడం ఖాయమని అంటున్నారు. ఈ వార్త‌లో నిజం ఎంత ఉంది అనేది పక్కన పెడితే ఈ సినిమాలో నటించడానికి ఎంత గానో ఆయన ఆస‌క్తి తో ఉన్నాడ‌ని సమాచారం. దీని పై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పాత్రలో సుకుమార్ చనిపోయే అవకాశం ఉందట‌. అడవి లో జరిగే ఒక యాక్షన్ సన్నివేశంలో ఆయన ఒక ఊబిలో పడిపోయే అవకాశం ఉందని అప్పుడు ఆయన చనిపోతారని సమాచారం. మరి నిజమో కాదో... చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: