పెళ్ళి అంటే నూరేళ్ళ పంట అని అద్భుతమైన తెలుగు సినిమా పాట ఒకటి ఉంది. పెళ్ళి అన్నది జీవితానికి అర్ధం పరమార్ధం అంటారు. నిజానికి మనిషి పుట్టినపుడు సగం అంటారు. పెళ్ళితో జంట కలిస్తే పరిపూర్ణం అని చెబుతారు. అలాంటి పెళ్ళి మీద వర్తమాన సమాజంలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

 

పెళ్ళి చేసుకోవడం ఎందుకూ, సొంతంగా  హాయిగా జీవితంలో ఉండిపోతే బాగుటుంది అన్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇక సినిమా ఫీల్డ్ లో పెళ్ళి వద్దు అంటున్న వారు రొజురోజుకీ  పెరిగిపోతున్నారు. సినిమాల్లో వెండితెర మీద ప్రేమలు, పెళ్ళిళ్ళు చేసుకున్న వారు నిజ జీవితంలో మాత్రం పెళ్ళి వద్దు బాబోయి అనేస్తున్నారు. సింగిల్ లైఫ్ హ్యాపీ అంటున్నారు. ఓ విధంగా సోలో బతుకే సో బెటర్ అని కూడా చెబుతున్నారు.

 

తాజాగా సినీ హీరోయిన్ సాయి పల్లవి తనకు పెళ్ళి చేసుకోవాలని లేదు అని పక్కా క్లారిటీగా చెప్పేసింది. పెళ్ళి కంటే తనకు తన తల్లిదండ్రులు ముఖ్యమని, వారిని చూసుకుంటానని బాగానే చెప్పినా కూడా పెళ్ళి అవసరం ఉంది అన్నది సాయిపల్లవి ఎందుకు మరచిందో ఆమెకే తెలియాలి. ఏమైనా తన పెళ్ళి పేరిట వస్తున్న న్యూస్ కి ఆమె అలా చెక్ పెట్టేసింది.

 

ఇక ఇదే టాలీవుడ్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా వరస సినిమాలు చేస్తున్న  ఒకనాటి హీరోయిన్  సితార కూడా పెళ్ళి చేసుకోను అంటోంది. ఆమె వయసు 47 ఏళ్ళు. ఆమె ఇక తన జీవితం ఒంటరిగానే అంటోంది. మరో వైపు చూస్తే పెళ్ళిపేరు ఎత్తకుండా సినిమాలు చకచకా చేసేస్తున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. త్రిష వయసు 37 ఏళ్ళు. ఆమె పెళ్ళి ఊసు ఎత్తడంలేదు కాజల్ కూడా 35 ఏళ్ళు దాటేసింది. ఇక అనుష్క 38 ఏళ్ళు దగ్గరపడుతోంది. చార్మి అయితే పెళ్ళి గురించి మాట్లాడడం లేదు

 

తమన్నా ఈ ఏడాది  పెళ్ళి చేసుకుంటుందని అంతా అనుకున్నా మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతోంది. మరి వీరంతా ఎపుడు పెళ్ళి చేసుకుంటారో తెలియదు కానీ  పెళ్ళి మాటకు మాత్రం నో చెప్పేస్తున్నారు. ఓ విధంగా చెప్పుకోవాలంటే పెళ్ళి కంటే ప్రొఫెషన్ ముఖ్యమనుకునే వారు ఉన్నారు. పెళ్ళి కంటే ఇలాగే  ఉంటే బాగుంటుంది అనే వారు కూడా ఉన్నారు. ఎవరి ఆలోచనలు వారివి. ఏమైనా ఇపుడు పెళ్ళి పాధాన్యత అలా తగ్గిపోతోంది అని సరిపెట్టుకోవాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: