మన టాలీవుడ్ లో బాహుబలి ఫ్రాంఛైజీ కి ముందు పాన్ ఇండియా సినిమా అన్న మాట వినిపించలేదు. కాని బాహుబలి రెండవ భాగం కన్‌క్లూజన్ రిలీజై భారీ సక్సస్ ని అందుకున్నాక ఈ మాట మొదలైంది. బాహుబలి మొదటి భాగంతో తెలుగు సినిమా సత్తాని చాటిన రాజమౌళి రెండవ భాగం తో తెలుగు సినిమా చరిత్రని కొత్తగా రాసేలా చేశారు. అంతేకాదు ప్రపంచ స్థాయిలో మన తెలుగు సినిమా ఘన కీర్తి లను చాటి చెప్పారు. అప్పటి నుంచి పాన్ ఇండియా దర్శకుడిగా రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్, పాన్ ఇండియా రేంజ్ సినిమాగా బాహుబలి అని రాయడం మొదలైంది.

 

దాంతో పాన్ ఇండియా సినిమాగా పలానా సినిమా రాబోతుందని ... ఇది పాన్ ఇండియా కేటగిరీలో నిర్మించే సినిమా.. అని చాలా సినిమాల గురించి రాసేస్తున్నారు. దాదాపు స్టార్ హీరోలతో నిర్మించే సినిమా ని 4-5 భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తూ భారీ బడ్జెతో తెరకెక్కే పాన్ ఇండియా సినిమా అంటూ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి ప్రభాస్ బాహుబలి తర్వాత మళ్ళీ అదే స్థాయిలో ఆర్.ఆర్.ఆర్ ని తెరకెక్కిస్తుండగా ఎన్.టి.ఆర్ , రాం చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అలాగే సైరా తో మెగాస్టార్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారారు.

 

ఇప్పుడు రాబోతున్న పుష్ప తో అల్లు అర్జున్, ఫైటర్ తో విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా స్టార్స్ అన్న పేరుని సాధిస్తారని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లకి ఉన్న క్రేజ్ తో వాళ్ళ నెక్స్ట్ సినిమాలని భారీ బడ్జెట్ లతో పాన్ ఇండియా రేంజ్ సినిమాలని తీసి వాళ్ళు ఆ క్రేజ్ సంపాదించుకుంటారు. అయితే ఇపటి వరకు "పాన్ ఇండియా హీరోయిన్" అన్న పేరు మాత్రం వినిపడలేదు. ఇది కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఖచ్చితంగా ప్రతీ సినిమాలో హీరోయిన్ ఉండనే ఉంటుంది. బాహుబలి సినిమాలో అనుష్క, తమన్నా నటించినప్పటికి వీళ్ళిద్దరికి పాన్ ఇండియా హీరోయిన్ అని ఆ తర్వాత వినిపించలేదు. 

 

నయనతార కి సౌత్ లో హీరోయిన్ గా మంచి పేరే ఉంది. కాని ఈవిడకి పాన్ ఇండియా హీరోయిన్ అన్న క్రేజ్ లేదని చెప్పాలి. దాదాపు 13 ఏళ్ళ నుండి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలతో నటించి భారీ సక్సస్ లను అందుకుంది. రాజమౌళి తెరకెక్కించిన మగధీర తో ఆమెకి వచ్చిన క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. చెప్పాలంటే కొన్ని సినిమాలలో హీరోయిన్ కూడా హీరోలకి సమానంగా కష్టపడుతున్నారు. అయితే హీరోయిన్స్ కి మాత్రం పాన్ ఇండియా హీరోయిన్ అన్న క్రేజ్ దక్కడం లేదు. ఎందుకు అనేదే అర్థం కాని ప్రశ్న. 

మరింత సమాచారం తెలుసుకోండి: